యెషయా 23
23
1తూరునుగూర్చిన దేవోక్తి
–తర్షీషు ఓడలారా, అంగలార్చుడి
తూరు పాడైపోయెను
ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు
కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి
చేయబడెను.
2సముద్రతీరవాసులారా, అంగలార్చుడి
సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సర
కులతో నిన్ను నింపిరి.
3షీహోరు నది ధాన్యము నైలునది పంట
సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను
తూరువలన జనములకు లాభము వచ్చెను.
4సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము
మాటలాడుచున్నది
–నేను ప్రసవవేదనపడనిదానను పిల్లలు కననిదానను
యౌవనస్థులను పోషింపనిదానను
కన్యకలను పెంచనిదానను.
5ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరునుగూర్చి
మిక్కిలి దుఃఖింతురు.
6తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగ
లార్చుడి.
7నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన
కాలముననుండిన పట్టణమిదేనా?
పరదేశనివాసముచేయుటకు దూరప్రయాణముచేసిన
దిదేనా?
8దాని వర్తకులు రాజసమానులు
దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు
కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయ
నెవడు ఉద్దేశించెను?
9సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుట
కును
భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును
సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయ
నుద్దేశించెను.
10తర్షీషుకుమారీ, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను
నైలునది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము.
11ఆయన సముద్రముమీద తన చెయ్యి చాపెను
రాజ్యములను కంపింపజేసెను
కనానుకోటలను నశింపజేయుటకు యెహోవా దాని
గూర్చి ఆజ్ఞాపించెను.
12మరియు ఆయన
–సీదోను కన్యకా, చెరపబడినదానా,
నీకికను సంతోషముండదు నీవు లేచి కిత్తీముకు దాటి
పొమ్ము
అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు
13ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జన
ముగా ఉండరు
అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా
చేసియున్నారు.వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు.
14తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, మీ దుర్గము పాడై
పోయెను.
15ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున
డెబ్బది సంవత్సరములు మరవబడును
డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో
ఉన్నట్లు జరుగును, ఏమనగా
16మరవబడిన వేశ్యా, సితారాతీసికొని పట్టణములో
తిరుగులాడుము
నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయిం
చుము
అనేక కీర్తనలు పాడుము.
17డెబ్బది సంవత్సరముల అంతమున యెహోవా తూరును
దర్శించును
అది వేశ్యజీతమునకు మరల భూమిమీదనున్న సమస్త
లోక రాజ్యములతో వ్యభిచారము చేయును.
18వేశ్యజీతముగా ఉన్నదాని వర్తకలాభము యెహోవాకు
ప్రతిష్ఠితమగును
అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు
యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు
భోజనమునకును ప్రశస్త వస్త్రములకును
ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 23: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.