యెషయా 22

22
1దర్శనపులోయనుగూర్చిన దేవోక్తి
2–ఏమివచ్చి నీలోనివారందరు మేడలమీది కెక్కియున్నారు?
అల్లరితో నిండి కేకలువేయు పురమా,
ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా,
నీలో హతులైనవారు ఖడ్గముచేత హతముకాలేదు
యుద్ధములో వధింపబడలేదు.
3నీ అధిపతులందరు కూడి పారిపోగా విలుకాండ్లచేత
కొట్టబడకుండ పట్టబడినవారైరి.
మీలో దొరికినవారందరు పట్టబడి దూరమునకు
పారిపోయిరి
4నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను
నాకు విముఖులై యుండుడి
నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను
ఓదార్చుటకు తీవరపడకుడి.
5దర్శనపు లోయలో సైన్యములకధిపతియు ప్రభువు
నగు యెహోవా అల్లరిదినమొకటి నియమించి
యున్నాడు
ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును
ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని
వినబడును.
6ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి
అంబులపొదిని వహించియున్నది.
కీరు డాలు పై గవిసెన తీసెను
7అందుచేత అందమైన నీ లోయలనిండ రథములున్నవి
గుఱ్ఱపురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొనుచున్నారు.
8అప్పుడు యూదానుండి ఆయన ముసుకు తీసివేసెను
ఆ దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధము
లను కనిపెట్టితివి.
9దావీదుపట్టణపు ప్రాకారము చాలామట్టుకు పడి
పోయినదని తెలిసికొని దిగువనున్న కోనేటి
నీళ్లను మీరు సమకూర్చితిరి.
10యెరూషలేము యిండ్లను లెక్కపెట్టి ప్రాకారమును
గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి
11పాత కోనేటినీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల
మధ్యను చెరువు కట్టితిరి
అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచినవారు కారు
పూర్వకాలమున దాని నిర్మించినవానిని మీరు లక్ష్య
పెట్టకపోతిరి.
12ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి
చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును
సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా
మిమ్మును పిలువగా
13రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు 14కాగా ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు–మీరు మరణము కాకుండ ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు.
15ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్తయొద్దకు పోయి అతనితో ఇట్లనుము
16–ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు?
నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల?
ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు
శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు
17ఇదిగో బలాఢ్యుడొకని విసరివేయునట్లు
యెహోవా నిన్ను వడిగా విసరివేయును
ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును
18ఆయన నిన్ను మడిచి యొకడు చెండు వేసినట్టు
విశాలమైన దేశములోనికి నిన్ను విసరివేయును.
నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చిన
వాడా,
అక్కడనే నీవు మృతిబొందెదవు
నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును
19నీ స్థితినుండి యెహోవానగు నేను నిన్ను తొలగించె
దను
నీ ఉద్యోగమునుండి ఆయన నిన్ను త్రోసివేయును.
20ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి 21అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత అతని బలపరచి నీ అధికారమును అతనికిచ్చెదను; అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును.
22నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని
భుజముమీద ఉంచెదను
అతడు తీయగా ఎవడును మూయజాలడు
అతడు మూయగా ఎవడును తీయజాలడు
23దిట్టమైనచోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిర
పరచెదను
అతడు తన పితరులకుటుంబమునకు మాన్యతగల
సింహాసనముగా నుండును.
24గిన్నెలవంటి పాత్రలను బుడ్లవంటి సమస్తమైన చిన్న
చెంబులను
అనగా అతని పితరుల సంతాన సంబంధులగు పిల్లజల్ల
లందరిని అతనిమీద వ్రేలాడించెదరు.
25సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెల
విచ్చుచున్నాడు
ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు
ఊడదీయబడి తెగవేయబడి పడును
దానిమీదనున్న భారము నాశనమగును
ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 22: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెషయా 22 కోసం వీడియో