యెషయా 21
21
1సముద్రతీరముననున్న అడవిదేశమునుగూర్చిన దేవోక్తి
–దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు
అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.
2కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అను
గ్రహింపబడియున్నది.
మోసముచేయువారు మోసము చేయుదురు
దోచుకొనువారు దోచుకొందురు
ఏలామూ, బయలుదేరుము
మాద్యా, ముట్టడివేయుము
వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.
3కావున నా నడుము బహు నొప్పిగా నున్నది
ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పెట్టి
యున్నది
బాధచేత నేను వినలేకుండ నున్నాను
విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను.
4నా గుండె తటతట కొట్టుకొనుచున్నది
మహా భయము నన్ను కలవరపరచుచున్నది
నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను.
5వారు భోజనపు బల్లను సిద్ధముచేయుదురు
తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు.
అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి;
ప్రభువు నాతో ఇట్లనెను
6–నీవు వెళ్లి కావలివాని నియమింపుము
అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను.
7జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు
గాడిదలును
వరుసలుగావచ్చు ఒంటెలును అతనికి కనబడగా
అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి
చూచును
8సింహము గర్జించునట్టు కేకలు వేసి
–నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును
కావలి బురుజుమీద నిలుచుచున్నాను
రాత్రి అంతయు కావలి కాయుచున్నాను
9ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను.
బబులోను కూలెను కూలెను
దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు
ముక్కలు ముక్కలుగా విరుగగొట్టియున్నాడు అని
చెప్పుచు వచ్చెను.
10నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చ
బడినవాడా,
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు
యెహోవావలన నేను వినిన సంగతి నీకు
తెలియజెప్పియున్నాను.
11దూమానుగూర్చిన దేవోక్తి
–కావలివాడా, రాత్రి యెంత వేళైనది?
కావలివాడా, రాత్రి యెంత వేళైనది?
అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను
అడుగుచున్నాడు
12కావలివాడు
–ఉదయమునగును రాత్రియునగును
మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల
రండి అనుచున్నాడు.
13అరేబియానుగూర్చిన దేవోక్తి
–దెదానీయులైన సార్థవాహులారా,
సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.
14తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి
పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని
రండి
15ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయముచేతను
ఎక్కు పెట్టబడిన ధనుస్సుల భయముచేతను
క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవుచున్నారు
16ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడు–కూలివారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే
కేదారు ప్రభావమంతయు నశించిపోవును.
17కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు.
ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
సెలవిచ్చియున్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 21: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.