ద్వితీయోపదేశకాండము 33

33
1దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను–
2యెహోవా సీనాయినుండి వచ్చెను
శేయీరులోనుండి వారికి ఉదయించెను
ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను
వేవేల పరిశుద్ధ సమూహములమధ్యనుండి ఆయన వచ్చెను
ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియు
చుండెను.
3ఆయన జనములను ప్రేమించును
ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురువారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు
నీ ఉపదేశమును అంగీకరింతురు.
4మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను
అది యాకోబు సమాజ స్వాస్థ్యము.
5జనులలో ముఖ్యులును ఇశ్రాయేలు గోత్రములును కూడగా
అతడు యెషూరూనులో రాజు ఆయెను.
6రూబేను బ్రదికి చావక యుండునుగాక
అతనివారు లెక్కింపలేనంతమంది#33:6 కొద్ది. అగుదురు.
7యూదానుగూర్చి అతడిట్లనెను–
యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజల
యొద్దకు అతనిని చేర్చుము.
యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని
శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై
యుందువు.
8లేవినిగూర్చి యిట్లనెను–
నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు
మస్సాలో నీవు అతని పరిశోధించితివి
మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి.
9అతడు–నేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు
తన తల్లినిగూర్చియు అనెను
తన సహోదరులను లక్ష్యపెట్టలేదు
తన కుమారులను కుమారులని యెంచలేదువారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి.
10వారు యాకోబునకు నీ విధులను
ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు
నీ సన్నిధిని ధూపమును
నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు
11యెహోవా, అతని బలమును అంగీకరించుము
అతడుచేయు కార్యమును అంగీకరించుమీ
అతని విరోధులును అతని ద్వేషించువారును లేవకుండునట్లువారి నడుములను విరుగగొట్టుము.
12బెన్యామీనునుగూర్చి యిట్లనెను–
బెన్యామీను యెహోవాకు ప్రియుడు
ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును
దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును
ఆయన భుజములమధ్య#33:12 అతని భుజములమీద ఆయన నివసించును. అతడు నివసించును
13యోసేపునుగూర్చి యిట్లనెను–
ఆకాశ పరమార్థములవలన మంచువలన
క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన
14సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థములవలన
చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన
15పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థములవలన
నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థములవలన
16సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థములవలన
యెహోవా అతని భూమిని దీవించును
పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును
తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి
మీదికి అది వచ్చును.
17అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు.
అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు
వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను
త్రోసివేయును
ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క
వేలును ఆలాగున నుందురు.
18జెబూలూనునుగూర్చి యిట్లనెను–
జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతో
షించుము
ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము.
19వారు జనములను కొండకు పిలిచిరి
అక్కడ నీతి బలులనర్పింతురువారు సముద్రముల సమృద్ధిని
ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు.
20గాదునుగూర్చి యిట్లనెను–
గాదును విశాలపరచువాడు స్తుతింపబడును
అతడు ఆడుసింహమువలె పొంచియుండును బాహు
వును నడినెత్తిని చీల్చివేయును.
21అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను
అక్కడ నాయకుని భాగము కాపాడబడెను.
అతడు జనములోని ముఖ్యులతోకూడ వచ్చెను
యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను
ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచ
రించెను.
22దానునుగూర్చి యిట్లనెను–
దాను సింహపుపిల్ల
అది బాషానునుండి దుమికి దాటును.
23నఫ్తాలినిగూర్చి యిట్లనెను–
కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి,
యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి,
పశ్చిమ#33:23 లేక, సముద్రము. దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.
24ఆషేరునుగూర్చి యిట్లనెను–
ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ
దింపబడును.
అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును
తన పాదములను తైలములో ముంచుకొనును.
25నీ కమ్ములు#33:25 పాదరక్షలు. ఇనుపవియు ఇత్తడివియునై యుండును.
నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి#33:25 లేక, బలము. కలుగును.
26యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు
ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై
వచ్చును
మహోన్నతుడై మేఘవాహనుడగును.
27శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము
నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును
ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్లగొట్టి–
నశింపజేయుమనెను.
28ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును
యాకోబు ఊట ప్రత్యేకింపబడును
అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములోనుండును
అతనిపై ఆకాశము మంచును కురిపించును.
29ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు?
ఆయన నీకు సహాయకరమైన కేడెము
నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము
నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము
వేయుదురు
నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయోపదేశకాండము 33: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ద్వితీయోపదేశకాండము 33