అపొస్తలుల కార్యములు 23

23
1పౌలు మహా సభవారిని తేరిచూచి–సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. 2అందుకు ప్రధానయాజకుడైన అననీయ–అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్నవారికి ఆజ్ఞాపింపగా 3-4పౌలు అతనిని చూచి–సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచియున్నవారు –నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి. 5అందుకు పౌలు సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు–
నీ ప్రజల అధికారిని నిందింపవద్దు
అని వ్రాయబడి యున్నదనెను. 6వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి–సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమునుగూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. 7అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను. 8సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు. 9అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి–ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి. 10కలహమెక్కు వైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి–మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను.
11ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి–ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్ష్య మియ్యవలసియున్నదని చెప్పెను.
12ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. 13ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ. 14వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును వచ్చి–మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము. 15కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనినిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి. 16అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. 17అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచి–ఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడుకొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను. 18శతాధిపతి సహస్రాధిపతియొద్ద కతని తోడుకొనిపోయి–ఖైదీయైన పౌలు నన్ను పిలిచి–నీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ పడుచువానిని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను. 19సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసి కొనిపోయి–నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని యొంటరిగా అడిగెను. 20అందుకతడు–నీవు పౌలునుగూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసికొని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి యున్నారు. 21వారి మాటకు నీవు సమ్మతింపవద్దు; వారిలో నలువదిమందికంటె ఎక్కువ మనుష్యులు అతనికొరకు పొంచియున్నారు. వారు అతని చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనియున్నారు; ఇప్పుడు నీయొద్ద మాట తీసికొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను. 22అందుకు సహస్రాధిపతి–నీవు ఈ సంగతి నాకు తెలిపితివని యెవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను. 23తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి–కైసరయవరకు వెళ్లుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపురౌతులను ఇన్నూరు మంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి 24పౌలును ఎక్కించి–అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధపరచుడని చెప్పెను. 25మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను–
26మహాఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు. 27యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని. 28వారు అతనిమీద మోపిన నేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభయొద్దకు అతనిని తీసికొనివచ్చితిని. 29వారు తమ ధర్మశాస్త్రవాదములనుగూర్చి అతనిమీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు. 30అయితే వారు ఈ మనుష్యునిమీద కుట్రచేయనై యున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతని నీయొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతనిమీద చెప్పవలెనని యున్న సంగతి నీయెదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని.
కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి. 31మరునాడు వారతనితోకూడ రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. 32వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడ అతనియెదుట నిలువ బెట్టిరి. 33అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు–ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని 34–నీమీద నేరము మోపువారు కూడ వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి, 35హేరోదు అధికారమందిరములో అతనిని కావలియందుంచవలెనని ఆజ్ఞాపించెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

అపొస్తలుల కార్యములు 23: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for అపొస్తలుల కార్యములు 23