1
2 కొరింథీ పత్రిక 4:18
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కాబట్టి కనిపించే వాటిపై కాక కనిపించని వాటిపై మా దృష్టిని నిలిపాము. ఎందుకంటే కనిపించేవి తాత్కాలికమైనవి, కనిపించనివి శాశ్వతమైనవి.
సరిపోల్చండి
Explore 2 కొరింథీ పత్రిక 4:18
2
2 కొరింథీ పత్రిక 4:16-17
కాబట్టి మేము ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోము. మేము బాహ్యంగా క్షీణిస్తున్నా, అంతరంగంలో దినదినం నూతనపరచబడుతున్నాము. మేము అనుభవిస్తున్న ఈ క్షణికమైన తేలికైన కష్టాలు వాటికన్నా ఎంతో అధికమైన నిత్య మహిమను సంపాదిస్తున్నాయి.
Explore 2 కొరింథీ పత్రిక 4:16-17
3
2 కొరింథీ పత్రిక 4:8-9
మేము అన్ని వైపుల నుండి తీవ్రమైన శ్రమలకు గురయ్యాం కాని నలిగిపోలేదు; ఆందోళన కలిగినా నిరాశ చెందలేదు; హింసించబడినా విడిచిపెట్టబడలేదు; పడత్రోయబడినా నాశనమవ్వలేదు.
Explore 2 కొరింథీ పత్రిక 4:8-9
4
2 కొరింథీ పత్రిక 4:7
అయితే ఈ అత్యధిక శక్తి అంతా దేవునిదే గాని మాది కాదు అని చూపించడానికి, మేము మట్టి పాత్రల్లో ఈ సంపదను కలిగి ఉన్నాము.
Explore 2 కొరింథీ పత్రిక 4:7
5
2 కొరింథీ పత్రిక 4:4
దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను తెలియజేసే సువార్త వెలుగును వారు చూడకుండ ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనస్సుకు గ్రుడ్డితనం కలుగజేసింది.
Explore 2 కొరింథీ పత్రిక 4:4
6
2 కొరింథీ పత్రిక 4:6
“చీకటి నుండి వెలుగు ప్రకాశించును గాక” అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింపజేశారు.
Explore 2 కొరింథీ పత్రిక 4:6
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు