ఆది 27:39-40

ఆది 27:39-40 IRVTEL

అతని తండ్రి ఇస్సాకు అతనికిలా జవాబిచ్చాడు. “చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది. పైనుండి ఆకాశపు మంచు దాని మీద కురవదు. నువ్వు నీ కత్తి మీద ఆధారపడి జీవిస్తావు. నీ తమ్ముడికి దాసుడివి అవుతావు. కానీ నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపైనుండి విరిచి వేస్తావు.”