నిర్గమ 21
21
1“నీవు వారి ఎదుట ఉంచవలసిన చట్టాలు ఇవే:
హెబ్రీ దాసులు
2“ఒకవేళ నీవు హెబ్రీ దాసులను కొంటే, వారు ఆరు సంవత్సరాలు నీకు సేవ చేయాలి. ఏడవ సంవత్సరంలో, ఏమి చెల్లించనవసరం లేకుండానే, వారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు. 3అతడు వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చియుంటే ఒంటరిగానే వెళ్లిపోవాలి; ఒకవేళ అతడు వచ్చినప్పుడు అతని భార్యతో వచ్చియుంటే, ఆమె తన భర్తతో వెళ్లిపోవాలి. 4ఒకవేళ వాని యజమాని వానికి భార్యను ఇస్తే ఆమె వానికి కుమారులను లేదా కుమార్తెలను కంటే, వాడు మాత్రమే స్వతంత్రునిగా వెళ్లాలి.
5“కాని ఒకవేళ దాసుడు, ‘నాకు నా యజమాని మీద, నా భార్య మీద నా పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి నేను స్వతంత్రునిగా వెళ్లను’ అని అంటే, 6వాని యజమాని వానిని దేవుని#21:6 లేదా న్యాయాధిపతుల ఎదుటకు తీసుకురావాలి. వాని యజమాని వానిని తలుపు దగ్గరకు గాని ద్వారబంధం దగ్గరకు గాని తీసుకెళ్లి వాని చెవిని కదురుతో గుచ్చాలి. అప్పుడు వాడు వాని యజమానికి జీవితకాల దాసునిగా ఉంటాడు.
7“ఒకవేళ ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మివేస్తే, ఆమె ఒక దాసుడు వెళ్లినట్లుగా స్వతంత్రంగా వెళ్లకూడదు. 8కావాలని ఆమెను ఎన్నుకున్న యజమానిని ఆమె సంతోషపెట్టలేకపోతే, అతడు ఆమెను విడిపించబడనివ్వాలి. అతడు ఆమెను విదేశీయులకు అమ్మడానికి అతనికి అధికారం లేదు, ఎందుకంటే అతడు ఆమె నమ్మకాన్ని వమ్ముచేశాడు. 9ఒకవేళ అతడు ఆమెను తన కుమారుని కోసం ఎంపికచేస్తే, ఆమెకు ఒక కుమార్తెకు ఇచ్చే హక్కు ఇవ్వాలి. 10అతడు మరొక స్త్రీని పెళ్ళి చేసుకుంటే, మొదటి భార్యకు ఆహారం, బట్టలు, దాంపత్య హక్కులు లేకుండ చేయకూడదు. 11అతడు ఈ మూడింటిని ఆమెకు సమకూర్చకపోతే, ఆమె డబ్బు ఏమి చెల్లించకుండ, స్వతంత్రురాలిగా వెళ్లిపోవచ్చు.
వ్యక్తిగత గాయాలు
12“ఎవరైనా చావు దెబ్బతో ఒక వ్యక్తిని కొడితే వారికి మరణశిక్ష విధించబడాలి. 13అయినప్పటికీ, ఒకవేళ అది ఉద్దేశపూర్వకంగా కాక, దేవుడు దానిని జరగనిస్తే, వారు నేను నియమించే స్థలానికి పారిపోవాలి. 14అయితే ఒకవేళ ఎవరైనా ఎవరినైన కావాలని కుట్రచేసి చంపితే, ఆ వ్యక్తిని నా బలిపీఠం దగ్గర నుండి ఈడ్చుకు వెళ్లి చంపివేయాలి.
15“ఎవరైనా తన తండ్రి మీద గాని తల్లి మీద గాని దాడి చేస్తే#21:15 లేదా చంపితే వారికి మరణశిక్ష విధించాలి.
16“ఎవరైనా ఎవరినైనా ఎత్తుకెళ్లిన తర్వాత ఒకవేళ అమ్మివేయబడినా లేదా వారి దగ్గరే ఉన్నా, ఎత్తుకెళ్లిన వారికి మరణశిక్ష విధించబడాలి.
17“ఎవరైనా తన తండ్రిని గాని తల్లిని గాని శపిస్తే#21:17 లేదా అమర్యాదగా మాట్లాడితే మత్తయి 15:4; మార్కు 7:10 తో పోల్చండి. వారికి తప్పక మరణశిక్ష విధించబడాలి.
18“ఒకవేళ ప్రజలు జగడమాడుతూ ఒక వ్యక్తి ఇంకొకరిని రాయితో గాని పిడికిలితో#21:18 లేదా పరికరంతో గాని కొడితే బాధితుడు చావకపోవచ్చు కాని మంచానికి పరిమితమై, 19తర్వాత అతడు లేచి చేతికర్ర సహాయంతో బయట తిరుగుతూ ఉంటే కొట్టినవానికి శిక్ష విధించబడదు; కాని ఆ కొట్టినవాడు గాయపడిన వ్యక్తికి ఆ సమయంలో కలిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించి ఆ బాధితుడు పూర్తిగా బాగుపడేలా చూడాలి.
20“ఎవరైనా తమ దాసుని గాని దాసిని గాని కర్రతో కొట్టినప్పుడు ఒకవేళ వారు చనిపోతే కొట్టినవారు శిక్షించబడాలి, 21కాని ఒకవేళ వారు ఒకటి లేదా రెండు రోజుల్లో కోలుకుంటే, ఆ దాసులు వారి ఆస్తియే కాబట్టి వారు శిక్షించబడనక్కర్లేదు.
22“ఒకవేళ ప్రజలు పోట్లాడుకుంటూ గర్భవతియైన స్త్రీని కొట్టినప్పుడు ఆమె అకాల జన్మనిస్తే#21:22 లేదా గర్భస్రావమైతే ఆమెకు గర్భస్రావమై మరి ఏ ఇతర గాయాలు కాకపోతే, దానికి కారణమైనవాడు ఆమె భర్త అడిగిన నష్టపరిహారాన్ని న్యాయాధిపతులు నిర్ణయించిన ప్రకారం చెల్లించాలి. 23తీవ్రమైన గాయాలు అయినప్పుడు మీరు విధించవలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం 24కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, 25వాతకు వాత, గాయానికి గాయం, నలిపివేతకు నలిపివేత.
26“ఒక యజమాని కొట్టడం వలన అతని దాసునికి గాని దాసికి గాని కన్ను పోతే కంటికి కలిగిన నష్టాన్ని బట్టి ఆ యజమాని వారిని స్వతంత్రంగా పోనివ్వాలి. 27యజమాని తన దాసునిది గాని దాసిది గాని పన్ను ఊడగొడితే ఆ పంటికి బదులుగా వారిని స్వతంత్రంగా పోనివ్వాలి.
28“ఒక ఎద్దు పురుషుని గాని స్త్రీని గాని చనిపోయేంతగా పొడిస్తే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. దాని మాంసం ఎవరూ తినకూడదు. కాని ఆ ఎద్దు యజమాని నిర్దోషి. 29అయితే ఎద్దుకు అంతకుముందే స్త్రీని గాని పురుషుని గాని పొడిచే అలవాటు ఉండి, దాని యజమానిని ఈ విషయంలో హెచ్చరించినా అతడు దానిని కట్టి అదుపులో పెట్టకపోవడం చేత ఆ ఎద్దు ఎవరినైనా చంపితే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. దాని యజమానికి మరణశిక్ష విధించాలి. 30ఒకవేళ నష్టపరిహారం అడిగితే ఆ యజమాని ఆ నష్టపరిహారాన్ని చెల్లించి తన ప్రాణాన్ని విడిపించుకోవచ్చు. 31ఆ ఎద్దు కుమారుని గాని కుమార్తెను గాని పొడిచినా ఇదే నియమం వర్తించబడుతుంది. 32ఎద్దు దాసుని గాని దాసిని గాని పొడిస్తే, దాని యజమాని ముప్పై షెకెళ్ళ#21:32 అంటే సుమారు 345 గ్రాములు వెండిని వారి యజమానికి చెల్లించాలి. ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.
33“ఒకరు గొయ్యిని తెరచి ఉంచడం వలన లేదా గొయ్యి త్రవ్వి దానిని మూయకపోవడం వలన ఎద్దు గాని గాడిద గాని దానిలో పడిపోతే 34ఆ గోతి యజమాని వాటి యజమానికి నష్టపరిహారం చెల్లించాలి; చచ్చిన జంతువు గొయ్యి యజమానిదవుతుంది.
35“ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును గాయపరచగా అది చనిపోతే ఆ ఇద్దరు బ్రతికి ఉన్న ఎద్దును అమ్మగా వచ్చిన డబ్బును చచ్చిన ఎద్దును చెరిసగం పంచుకోవాలి. 36ఆ ఎద్దుకు అంతకుముందే పొడిచే అలవాటు ఉంటే దాని యజమాని దానిని కట్టి అదుపులో పెట్టలేదు కాబట్టి అతడు ఖచ్చితంగా ఎద్దుకు బదులు ఎద్దు ఇవ్వాలి; చచ్చిన ఎద్దు అతనిది అవుతుంది.
Atualmente Selecionado:
నిర్గమ 21: TSA
Destaque
Compartilhar
Copiar

Quer salvar seus destaques em todos os seus dispositivos? Cadastre-se ou faça o login
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.