YouVersion Logo
Search Icon

పరమ గీతము 3

3
ఆమె అంటుంది
1రాత్రి నా పరుపు మీద,
నేను ప్రేమించిన వానికోసం వెదికాను.
అతని కోసం చూశాను,
కాని అతణ్ణి కనుగొనలేకపోయాను!
2ఇప్పుడు లేచి,
నగరమంతా తిరుగుతాను.
వీధుల్లోను కూడలి స్థలాల్లోను సంత వీధుల్లోనూ
నేను ప్రేమించిన వ్యక్తికోసం చూస్తాను.
అతని కోసం చూశాను,
కాని అతణ్ణి కనుక్కోలేక పోయాను!
3నగరంలో పాహరా తిరిగే కావలివాళ్లు నన్ను చూశారు.
వారినడిగాను, “నేను ప్రేమించిన వ్యక్తిని మీరు చూశారా?” అని.
4కావలివాళ్లను దాటిన వెంటనే
నేను ప్రేమించిన వ్యక్తిని కనుక్కున్నాను!
అతణ్ణి పట్టుకున్నాను.
అతణ్ణి పోనివ్వలేదు,
నా తల్లి ఇంటికి అతణ్ణి తీసుకొని వచ్చాను.
నన్ను కన్న తల్లి గదికి తీసుకొని వచ్చాను.
ఆమె స్త్రీలతో అంటుంది
5యెరూషలేము స్త్రీలారా, దుప్పులమీద, అడవి లేళ్లమీద ఒట్టు పెట్టి, నాకు వాగ్దానం చెయ్యండి, నేను సిద్ధపడేవరకూ
ప్రేమను లేపవద్దు,
ప్రేమను పురికొల్పవద్దు.
యెరూషలేము స్త్రీలు మాట్లాడుట
6పెద్ద జనం గుంపుతో
ఎడారినుండి వస్తున్న#3:6 ఎడారినుండి వస్తున్న చూడండి 8:5. ఈ స్త్రీ ఎవరు?
కాలుతున్న గోపరసం, సాంబ్రాణి#3:6 గోపరసం, సాంబ్రాణి కాల్చినప్పుడు తియ్యగా గుబాళించే ఖరీదైన సుగంధ ద్రవ్యాలు. ఇతర సుగంధ ద్రవ్యాల#3:6 సుగంధ ద్రవ్యాలు శబ్ధార్థ ప్రకారం, “వర్తకుడి చూర్ణాలు” “విదేశాలనుండి దిగుమతి చేసుకోవలసిన సుగంధ ద్రవ్యాలు, ధూపాలు.” సువాసనలతో
పొగమబ్బులు వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది.
7చూడు, సొలొమోను ప్రయాణపు పడక!#3:7 ప్రయాణపు శయ్య ధనికులు పడుకొని ప్రయాణం చేసే ఒకరకమైన పడక. ఈ శయ్యలు పైన కప్పబడి వుంటాయి. వీటికి పొడుగాటి కర్రలు దూర్చి, వాటిని బానిసలు మోస్తూ ఉంటారు.
అరవైమంది సైనికులు దానిని కాపలా కాస్తున్నారు.
వారు బలశాలురైన ఇశ్రాయేలు సైనికులు!
8వారందరూ సుశిక్షుతులైన పోరాటగాండ్రు,
వారి పక్కనున్న కత్తులు,
ఏ రాత్రి ప్రమాదానికైనా సిద్ధం!
9రాజు సొలొమోను తనకోసం ఒక ప్రయాణపు పడక చేయించాడు,
దాని కొయ్య లెబానోనునుండి వచ్చింది.
10దాని స్తంభాలు వెండితో చేయబడ్డాయి,
ఆధారాలు (కోళ్ళు) బంగారంతో చేయబడ్డాయి,
పడుకొనే భాగం ధూమ్ర వర్ణం వస్త్రంతో కప్పబడింది.
యెరూషలేము స్త్రీల ప్రేమతో అది పొదగబడింది.
11సీయోను స్త్రీలారా, బయటకు రండి
రాజు సొలొమోనును చూడండి
అతని పెండ్లి రోజున అతడు చాలా సంతోషంగా ఉన్న రోజున
అతని తల్లి పెట్టిన కిరీటాన్ని#3:11 కిరీటము ఇది బహుశః అతని పెండ్లి సమయంలో తల మీద ధరించిన పూలదండ కావచ్చును. చూడండి!

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in