YouVersion Logo
Search Icon

పరమ గీతము 2

2
1నేను షారోనులోని గులాబి పువ్వును. లోయలలోని సుగంధ పుష్పాన్ని#2:1 నేను … సుగంధ పుష్పాన్ని “వసంత కాలపు గంటాకార తెల్లని పరిమళ పువ్వు”..
అతడు అంటున్నాడు
2నా ప్రియురాలా, ఇతర స్త్రీలలో నీవు
ముళ్ల మధ్య గులాబి పుష్పంలా ఉన్నావు!
ఆమె అంటుంది
3నా ప్రియుడా, ఇతర పురుషుల మధ్య నీవు
అడవిచెట్ల మధ్య జల్దరు చెట్టులా ఉన్నావు!
ఆమె స్త్రీలతో అంటుంది
ఆనంద భరితనై నేనతని నీడన కూర్చుంటాను!
నా ప్రియుని నీడలో కూర్చుని నేను ఆనందిస్తాను, అతని ఫలం నాకెంతో రుచికరంగా వుంది.
4నా ప్రియుడు నన్ను ద్రాక్షారసశాలకు తీసుకుని వచ్చాడు,
నా మీద అతని ఉద్దేశం ప్రేమ.
5ఎండు ద్రాక్షాలతో#2:5 ఎండు ద్రాక్షాలు లేదా “ఎండు ద్రాక్ష రొట్టెలు.” నాకు బలాన్నివ్వండి,
జల్దరు పండ్లతో నా అలసట తీర్చండి, ఎందుకంటే నేను ప్రేమతో బలహీనమయ్యాను.#2:5 ప్రేమతో బలహీనమయ్యాను లేదా “నేను ప్రేమ రోగిని.”
6నా ప్రియుని ఎడమ చేయి నా తల క్రింద ఉంది,
అతని కుడి చేయి నన్ను కౌగలించుకొంది.
7యెరూషలేము స్త్రీలారా, దుప్పులమీద, అడవి లేళ్ల మీద ఒట్టేసి నాకు వాగ్దానం చెయ్యండి, నేను సిద్ధపడేవరకూ.#2:7 నేను సిద్ధపడేవరకూ శబ్దార్థ ప్రకారం “అది కోరేవరకు.”
ప్రేమను లేపవద్దు,
ప్రేమను పురికొల్పవద్దు.
ఆమె మళ్లీ అంటుంది
8నా ప్రియుని గొంతు వింటున్నాను.
అదిగో అతడు వస్తున్నాడు.
పర్వతాల మీది నుంచి దూకుతూ
కొండల మీది నుంచి వస్తున్నాడు.
9నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు
లేదా లేడి పిల్లలా ఉన్నాడు.
మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు,
కిటికీలోనుంచి తేరి పార చూస్తూ,
అల్లిక కిటికీలోనుంచి#2:9 అల్లిక కిటికీలోనుంచి లేదా “కిటికీమీద ఉండే కొయ్యతెర.” చూస్తూ
10నా ప్రియుడు నాతో అంటున్నాడు,
“నా ప్రియురాలా, లెమ్ము,
నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం!
11చూడు, శీతాకాలం వెళ్లిపోయింది,
వర్షాలు వచ్చి వెళ్లిపోయాయి.
12పొలాల్లో పూలు వికసిస్తున్నాయి
ఇది పాడే సమయం!#2:12 పాడే సమయం లేదా “చక్కదిద్దే.”
విను, పావురాలు తిరిగి వచ్చాయి.
13అంజూర చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి.
పూస్తున్న ద్రాక్షా పూల సువాసన చూడు.
నా ప్రియురాలా, సుందరవతీ, లేచిరా,
మనం వెళ్లిపోదాం!”
అతడు అంటున్నాడు
14కనపడని ఎత్తైన శిఖరంమీద గుహల్లో దాక్కొన్న నా పావురమా!
నిన్ను చూడనిమ్ము,
నీ గొంతు విననిమ్ము,
నీ గొంతు ఎంతో మధురం,
నువ్వెంతో సుందరం!
ఆమె స్త్రీలతో అంటుంది
15మాకోసం గుంటనక్కల్ని
ద్రాక్షాతోటల్ని పాడుచేసే చిన్న గుంటనక్కల్ని పట్టుకోండి!
మా ద్రాక్షాతోట ఇప్పుడు పూతమీద ఉంది.
16నా ప్రియుడు నావాడు,
నేను అతని దానను!
అతడు సుగంధ పుష్పాల పద్మాల నడుమ గొర్రెలను మేపుతున్నాడు!
17నా ప్రియుడా, సూర్యాస్తమయమై, ఇక నీడలు మాయమయ్యే వేళలో
చీలిన పర్వతాల#2:17 చీలిన పర్వతాలు లేదా “బెథెర్ పర్వతాలు” లేదా “సుగంధ ద్రవ్యాల పర్వతాలు.” మీద దుప్పిలా, లేడిపిల్లలా తిరుగు!

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in