YouVersion Logo
Search Icon

ఎజ్రా 2

2
యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్ల జాబితా
1వీళ్లు బబులోను రాజ్యంలో నిర్బంధం నుంచి తిరిగి వచ్చినవాళ్లు. గతంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వీళ్లని బందీలుగా పట్టుకొని, బబులోనుకు తెచ్చాడు. ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు, యూదాకు తిరిగివచ్చారు. వాళ్లు తమ తమ సొంత పట్టణాలకి తిరిగి వెళ్లారు. 2జెరుబ్బాబెలుతో పాటు తిరిగివచ్చిన వాళ్లలో యేషూవా, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనే వాళ్లున్నారు. బబులోను నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్ల జాబితా, వాళ్ల సంఖ్యల వివరం ఇది:
3పరోషు వంశస్థులు 2,172
4షెపట్యా వంశస్థులు 372
5అరహు వంశస్థులు 775
6యేషూవ, యోవాబు వంశాలకి చెందిన పహత్మోయాబు, మోయాబు వంశస్థులు 2,812
7ఏలాము వంశస్థులు 1,254
8జత్తూ వంశస్థులు 945
9జక్కయి వంశస్థులు 760
10బానీ వంశస్థులు 642
11బేబై వంశస్థులు 623
12అజ్గాదు వంశస్థులు 1,222
13అదొనీము వంశస్థులు 666
14బిగ్వయి వంశస్థులు 2,056
15అదీను వంశస్థులు 454
16అటేరు వంశస్థులు (హిజ్కియా కుటుంబం) 98
17బెజయి వంశస్థులు 323
18యోరా వంశస్థులు 112
19హాషుము వంశస్థులు 223
20గిబ్బారు వంశస్థులు 95
21బెత్లెహేము పట్నానికి చెందినవాళ్లు 123
22నెటోపా పట్టణం వాళ్లు 56
23అనాతోతు పట్టణంవాళ్లు 128
24అజ్మావెతు పట్టణంవాళ్లు 42
25కిర్యాతారీము, కెఫీరా,
బెయేరోతు పట్టణాల వాళ్లు 743
26రమా, గెబా పట్టణాలవాళ్లు 621
27మిక్మషు పట్టణం వాళ్లు 123
28బేతేలు, హాయి పట్టణంవాళ్లు 222
29నెబో పట్టణంవాళ్లు 52
30మగ్బీషు పట్టణంవాళ్లు 156
31ఏలాము అనే మరో పట్టణంవాళ్లు 1,254
32హారీము పట్టణంవాళ్లు 320
33లోదు, హదీదు, ఓనో పట్టణాలవాళ్లు 725
34యెరికో పట్టణంవాళ్లు 345
35సెనాయా పట్టణంవాళ్లు 3,630
36యాజకులు:
యేషూవ కుటుంబానికి చెందిన యెదాయ వంశస్థులు 973
37ఇమ్మేరు వంశస్థులు 1,052
38పషూరు వంశస్థులు 1,247
39హారీము వంశస్థులు 1,017
40ఇప్పుడిక లేవీయులలో
హోదవ్యా కుటుంబానికి చెందిన యేషూవా, కద్మీయేలు వంశస్థులు 74
41గాయకుల జాబితా:
అసాపు వంశస్థులు 128
42దేవాలయపు ద్వారపాలకుల వంశస్థులు
షల్లూము, ఆటేరు, టల్నోను, అక్కూబు, హటీటా, షోబయి వంశస్థులు 139
43దేవాలయపు ప్రత్యేక సేవకుల వంశస్థులు
జీహా, హశూపా, టబ్బాయోతు,
44కేరోసు, సీయహా, పాదోను,
45లెబానా, హగాబా, అక్కూబు,
46హాగాబు, షల్మయి, హానాను,
47గిద్దేలు, గహరు, రెవాయా,
48రెజీను, నెకోదా, గజ్జాము,
49ఉజ్జా, పాసెయ, బేసాయి,
50అస్నా, మెహూనీము, నెపూసీము,
51బక్బూకు, హకూపా, హర్హూరు
52బజ్లీతు, మెహీదా, హర్షా
53బర్కోసు, సీసెరా, తెమహు
54నెజీయాహు, హటీపా,
55సొలొమోను సేవకుల వంశస్థులు:
సొటయి, సోపెరెతు, పెరూదా,
56యహలా, దర్కోను, గిద్దేలు,
57షెపట్య, హట్టీలు, పొకెరెతు, జెబాయీము మరియు అమి
58దేవాలయ సేవకులూ, మరిము సొలొమోను సేవకుల వంశస్థులు కలిసి మొత్తం 392
59తేల్మెలహు తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్టణాలనుంచి యెరూషలేముకు కొందరు వచ్చారు. అయితే వీళ్లు తమ కుటుంబాల వాళ్లయిన ఇశ్రాయేలీయుల కుటుంబాలకు చెందినవాళ్లమని నిరూపించుకో లేకపోయారు. వాళ్లెవరంటే,
60దెలాయ్యా, టోబీయా, నెకోదా సంతతివారు మొత్తం 652
61యాజకుల కుటుంబాలకు చెందిన ఈ క్రింది వంశస్థులు వున్నారు:
హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశస్థులు. (గిలాదుకు చెందిన ఒకడు బర్జిల్లయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను బర్జిల్లయి సంతతివాడిగా పరిగణించబడ్డాడు.)
62వీళ్లు తమ వంశ చరిత్రకోసం గాలించారు. కానీ అది వాళ్లకి లభ్యం కాలేదు. వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో నమోదు కాలేదు. తమ పూర్వీకులు యాజకులని వాళ్లు నిరూపించ లేకపోయారు. దానితో, వాళ్లు యాజకులుగా సేవ చేయలేకపోయారు. 63వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులను తినకూడదని రాజ్యాధిపతి ఆజ్ఞ జారి చేశాడు. ఒక యాజకుడు ఊరీము, తుమ్మీము#2:63 ఊరీము, తుమ్మీము తీర్పు చిక్కంలో ఉన్నత యాజకుడు ధరించే ప్రత్యేకమైన రాళ్లు. అవి దైవ నిర్ణయాలను పొందేందుకు వినియోగింపబడేవి. నిర్గమ. 28:30 చూడండి. ధరించి, ఏమి చేయాలని దేవుణ్ణి అడిగేంతవరకు వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులేమీ తినలేకపోయారు.
64-65మొత్తంమీద తిరిగివచ్చిన ఆ వంశంలో 42,360 మంది వున్నారు. వాళ్లలో 7,337 మంది స్త్రీ, పురుష సేవకులను పరిగణలోకి తీసుకోకపోతే తేలిన సంఖ్య ఇది. వాళ్లతో 200 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు. 66-67వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి.
68ఆ వంశం యెరూషలేములోని దేవుని ఆలయానికి చేరుకుంది. తర్వాత కుటుంబ పెద్దలు దేవాలయ నిర్మాణం కోసం తమ కానుకలు సమర్పించారు. పాత దేవాలయం నేలమట్టము చేయబడిన చోటనే కొత్త దేవాలయ నిర్మాణానికి వాళ్లు పూనుకొన్నారు. 69వాళ్లు దేవాలయ నిర్మాణానికి తమ శక్తి కొద్దీ కానుకలు ఇచ్చారు 1,100 పౌనుల బంగారం, 3 టన్నుల వెండి, యాజకులు ధరించే 100 దుస్తులు వాళ్లు ఇచ్చారు.
70ఈ విధంగా యాజకులు, లేవీ గోత్రీకులు, తదితరులు కొంతమంది యెరూషలేముకి, దాని చుట్టూవున్న ప్రాంతాలకీ చేరుకున్నారు. ఈ వంశంలో దేవాలయ గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు వున్నారు. తదితర ఇశ్రాయేలీయులు తమ తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు.

Currently Selected:

ఎజ్రా 2: TERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in