YouVersion Logo
Search Icon

ఎజ్రా 1

1
యూదుల చెర విముక్తికి కోరెషు సహాయం
1పారశీక రాజ్యానికి కోరెషు రాజైన మొదటి సంవత్సరం,#1:1 మొదటి సంవత్సరం క్రీ.పూ. 538. యెహోవా కోరెషును ఒక ప్రకటన చేయవలసిందిగా ప్రోత్సహించాడు. కోరెషు ఆ ప్రకటనను వ్రాయించి, తన రాజ్యపు అన్ని ప్రాంతాలలోనూ చదివి వినిపించే ఏర్పాటు చేశాడు. దేవుడు యిర్మీయా నోట పలికించిన యీ సందేశం#1:1 దేవుడు … సందేశం యిర్మీ. 25:12-14 చూడండి. వాస్తవ రూపం ధరించేందుకు అనువుగా ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన యిలా సాగింది:
2“పారశీక రాజు కోరెషు తెలియజేసేది ఏమంటే:
పరలోకాధిపతి అయిన యెహోవా దేవుడు భూలోకంలోని దేశాలన్నింటినీ నాకు అప్పగించాడు. యూదా దేశంలోని యెరూషలేములో తనకొక ఆలయాన్ని నిర్మించేందుకుగాను యెహోవా నన్ను ఎంచుకున్నాడు. 3యెరూషలేములో వున్న ఇశ్రాయేలీయుల దేవుడే ప్రభువైన యెహోవా. మీ మధ్య దేవుని మనుష్యులు ఎవరైనా వున్నట్లయితే, వారిని ఆశీర్వదించ వలసిందిగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. యూదా దేశంలోని యెరూషలేముకు మీరు వాళ్లని పోనివ్వాలి. మీరు వాళ్లని దేవుని ఆలయాన్ని నిర్మించనివ్వాలి 4ఇశ్రాయేలీయుల్లో మిగిలివున్నవాళ్లు#1:4 మిగిలివున్నవాళ్లు విపత్తునుంచి తప్పించుకుని బయట పడ్డవాళ్లు, ఇక్కడ యూదా, ఇశ్రాయేలీయుల శత్రువుల సైన్యాలు అక్కడ జరిపిన విధ్వంసకాండలో చావక మిగిలిన యూదా ప్రజలని అర్థం. ఎక్కడైనా ఉన్నట్లయితే, వాళ్లకి అక్కడి ప్రజలు తోడ్పడాలి. ప్రజలు ఆ హతశేషులకు వెండిది బంగారాలు, ఆవులు, వగైరాలు ఇవ్వాలి. యెరూషలేములో దేవాలయ నిర్మాణం కోసం వాళ్లకి కానుకలు ఇవ్వాలి.”
5యూదా, బెన్యామీను వంశాలకు చెందిన కుటుంబాల పెద్దలు యెరూషలేముకు పోయేందుకు సన్నద్ధ మయ్యారు. వాళ్లు యెరూషలోములో దేవాలయ నిర్మాణానికి పోసాగారు. వాళ్లే కాకుండా, దేవుడు ప్రేరేపించిన ప్రతి ఒక్క వ్యక్తి యెరూషలేముకు పోయేందుకు సంసిద్ధుడయ్యాడు. 6వాళ్ల ఇరుగుపొరుగు వారు వాళ్లకి అనేక కానుకలు సమర్పించారు. వెండి బంగారాలు, ఆవులు, ఖరీదైన ఇతర వస్తువులు ఇచ్చారు. ఇరుగు పొరుగువారు వాళ్లకి ఈ కానుకలన్నీ స్వచ్ఛందంగా ఇచ్చారు. 7పూర్వం నెబుకద్నెజరు యెరూషలేమునందున్న యెహోవా ఆలయానికి చెందిన కొన్ని వస్తువులు కొల్లగొట్టి, వాటిని తన అబద్ధపు దేవతల ఆలయంలో వుంచాడు. వాటిని ఇప్పుడు కోరెషు మహారాజు బయటికి తీయించాడు. 8పారశీక రాజైన కోరెషు ఆ వస్తువులను బయటికి తీసుకురమ్మని తన ఖజానాదారుని ఆదేశించాడు. ఆ ఖజానాదారుని పేరు మిత్రిదాతు. మిత్రిదాతు ఆ వస్తువులను బయటికి తీయించి, వాటిని యూదా నాయకుడైన షేష్బజ్జరుకు#1:8 షేష్బజ్జరుకు బహూశాః ఇతను జెరుబ్బాబెల్ అయ్యుంటాడు. జెరుబ్బాబెల్ అన్న పదానికి “బబులోనులో అపరిచిత వ్యక్తి” లేక “బబులోను విడిచిపోయినవాడు” అని అర్థం. షేష్బజ్జరు అన్నది బహుశా అతని అరమాయిక్ పేరు అయ్యుంటుంది. అప్పగించాడు.
9మిత్రిదాతు బయటికి తెచ్చిన దేవాలయ వస్తువుల జాబితా యిది: బంగారు గిన్నెలు 30, వెండి గిన్నెలు 1,000, చాకులు, పెనాలు 29, 10బంగారు పాత్రలు 30, బంగారు పాత్రల వంటివే వెండి పాత్రలు 410, ఇతర పాత్రలు 1,000.
11వెండి బంగారాలతో చేసిన వస్తువులు కలసి మొత్తం 5,400 వున్నాయి. బబులోను చెరనుండి విడి పింపబడినవారు యెరూషలేముకు తిరిగి వెళ్లేటప్పుడు, షేష్బజ్జరు పై వస్తువులన్నింటినీ తనతో యెరూషలేముకు తీసుకువెళ్లాడు.

Currently Selected:

ఎజ్రా 1: TERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in