జెకర్యా 10
10
1కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. 2గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొఱ్ఱెలమంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధనొందిరి. 3నా కోపాగ్ని మండుచు కాపరులమీద పడును, మేకలను#10:3 నాయకులను. నేను శిక్షించెదను, సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వములవంటివారినిగా చేయును. 4వారిలోనుండి మూల రాయి పుట్టును, మేకును యుద్ధపువిల్లును వారిచేత కలుగును, బాధించువాడు వారిలోనుండి బయలుదేరును, 5వారు యుద్ధముచేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురవలె ఉందురు. యెహోవావారికి తోడై యుండును గనుక వారు యుద్ధముచేయగా గుఱ్ఱములను ఎక్కువారు సిగ్గునొందుదురు. 6నేను యూదా వారిని బలశాలురుగా చేసెదను, యోసేపు సంతతివారికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను, నేను వారియెడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు. 7ఎఫ్రా యిమువారు బలాఢ్యులవంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించునట్లువారు మనస్సున ఆనందింతురు, వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు, యెహోవానుబట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు. 8నేను వారిని విమోచించియున్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను,మునుపు విస్తరించినట్లువారు విస్తరించుదురు. 9అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసికొందురు, వారును వారి బిడ్డలును సజీవులై తిరిగి వత్తురు, 10ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశములోనుండి సమకూర్చి, యెక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికిని లెబానోను దేశము లోనికిని వారిని తోడుకొని వచ్చెదను. 11యెహోవా దుఃఖసముద్రమునుదాటి సముద్రతరంగములను అణచి వేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు. 12నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు; ఇదే యెహోవా వాక్కు.
Currently Selected:
జెకర్యా 10: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.