YouVersion Logo
Search Icon

పరమగీతము 5

5
1నా సహోదరీ, ప్రాణేశ్వరీ,
నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని
నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొను
చున్నాను
తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను
క్షీరసహితద్రాక్షారసము పానముచేయుచున్నాను.
2నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము
చేయుడి
స్నేహితులారా, పానము చేయుడి.
నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని
యున్నది
నా సహోదరీ, నా ప్రియురాలా,
నా పావురమా, నిష్కళంకురాలా, ఆలకింపుము
నా తల మంచుకు తడిసినది
నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి.
నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలితట్టు
చున్నాడు.
3నేను వస్త్రము తీసివేసితిని
నేను మరల దాని ధరింపనేల?
నా పాదములు కడుగుకొంటిని
నేను మరల వాటిని మురికిచేయనేల?
4తలుపుసందులో నా ప్రియుడు చెయ్యియుంచగా
నా అంతరంగము అతనియెడల జాలిగొనెను.
5నా ప్రియునికి తలుపు తీయ లేచితిని
నా చేతులనుండియు నా వ్రేళ్లనుండియు జటామాంసి
గడియలమీద స్రవించెను
6నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో
అతడు వెళ్లిపోయెను
అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను
నేనతని వెదకినను అతడు కనబడకపోయెను
నేను పిలిచినను అతడు పలుకలేదు.
7పట్టణములో తిరుగు కావలివారు
నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి
ప్రాకారముమీది కావలివారు
నా పైవస్త్రమును దొంగిలించిరి.
8యెరూషలేము కుమార్తెలారా,
నా ప్రియుడు మీకు కనబడినయెడల
ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని
మీరతనికి తెలియజేయునట్లు
నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.
9స్త్రీలలో అధిక సుందరివగుదానా,
వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?
నీవు మాచేత ప్రమాణము చేయించుకొనుటకు
వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?
10నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు
పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును
11అతని శిరస్సు అపరంజివంటిది
అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె
నల్లనివి
అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.
12అతని నేత్రములు నదీతీరములందుండు
గువ్వలవలె కనబడుచున్నవి
అవి పాలతో కడుగబడినట్టున్నవి
అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.
13అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు
సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగ
ములు
అతని పెదవులు పద్మములవంటివి
ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.
14అతని కరములు తర్షీషు రత్నభూషితమైన
స్వర్ణగోళమువలె ఉన్నవి
అతని కాయము నీలరత్నఖచితమైన
విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.
15అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు
నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి.
అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము
అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము
16అతని నోరు అతిమధురము.
అతడు అతికాంక్షణీయుడు
యెరూషలేము కూమార్తెలారా,
ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in