కీర్తనలు 97
97
1యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూ
లోకము ఆనందించునుగాక
ద్వీపములన్నియు సంతోషించునుగాక.
2మేఘాంధకారములు ఆయనచుట్టునుండును
నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.
3అగ్ని ఆయనకు ముందు నడచుచున్నది
అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది.
4ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి
భూమి దాని చూచి కంపించుచున్నది.
5యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని
పర్వతములుమైనమువలె కరగుచున్నవి.
6ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది
సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది
7వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు
చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడు
దురు
సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.
8యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ
న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు
యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.
9ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా
నీవు మహోన్నతుడవై యున్నావు
సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్న
త్యము పొందియున్నావు.
10యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును
అసహ్యించుకొనుడి
తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు.
భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.
11నీతిమంతులకొరకు వెలుగును
యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి
యున్నవి.
12నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి
ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతా
స్తుతులు చెల్లించుడి.
Currently Selected:
కీర్తనలు 97: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.