YouVersion Logo
Search Icon

కీర్తనలు 63

63
దావీదు యూదా అరణ్యములోనుండగా రచించిన కీర్తన.
1దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకు
దును
2నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని
పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని
పెట్టియున్నాను.
నీళ్లులేక యెండియున్న దేశమందు
నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది
నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము
కృశించుచున్నది.
3నీ కృప జీవముకంటె ఉత్తమము
నా పెదవులు నిన్ను స్తుతించును.
4నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని
రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు
5క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము
తృప్తిపొందుచున్నది
ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి
గానముచేయుచున్నది
6కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను
స్తుతించెదను
నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.
7నీవు నాకు సహాయకుడవై యుంటివి
నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని
చేసెదను.
8నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది
నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.
9నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని
వెదకుచున్నారువారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు
10బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు
నక్కలపాలగుదురు.
11రాజు దేవునిబట్టి సంతోషించును.
ఆయనతోడని ప్రమాణముచేయు ప్రతివాడును
అతిశయిల్లును
అబద్ధములాడువారి నోరు మూయబడును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in