కీర్తనలు 43
43
1దేవా, నాకు న్యాయము తీర్చుము
భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యె
మాడుము
కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి
నీవు నన్ను విడిపించుదువు.
2నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితి
వేమి?
నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప
నేల?
3నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము;
అవి నాకు త్రోవచూపును
అవి నీ పరిశుద్ధపర్వతమునకును నీ నివాసస్థలములకును
నన్ను తోడుకొని వచ్చును.
4అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు
నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవుని
యొద్దకు చేరుదును
దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృత
జ్ఞతాస్తుతులు చెల్లించెదను
5నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు?
నాలో నీవేల తొందరపడుచున్నావు?
దేవునియందు నిరీక్షణ యుంచుము
ఆయన నా రక్షణకర్త నా దేవుడు
ఇంకను నేనాయనను స్తుతించెదను.
Currently Selected:
కీర్తనలు 43: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.