YouVersion Logo
Search Icon

కీర్తనలు 42

42
ద్వితీయ స్కంధము.
ప్రధానగాయకునికి. కోరహు కుమారులు రచించినది. దైవధ్యానము.
1దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు
దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
2నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది
జీవముగల దేవునికొరకు తృష్ణగొనుచున్నది
దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన
సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?
3–నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో
అనుచుండగా
రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము
లాయెను.
4జనసమూహముతో పండుగచేయుచున్న సమూహ
ముతో నేను వెళ్లిన సంగతిని
సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు
నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని
జ్ఞాపకము చేసికొనగా
నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.
5నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు?
నాలో నీవేల తొందరపడుచున్నావు?
దేవునియందు నిరీక్షణ యుంచుము.
ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు
చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.
6నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది
కావున యొర్దాను ప్రదేశమునుండియు
హెర్మోను పర్వతమునుండియు మిసారు కొండ
నుండియు
నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను.
7నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు#42:7 అల. కరడును
పిలుచుచున్నది
నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా
పొర్లి పారియున్నవి.
8అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ
నాజ్ఞాపించును
రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు
నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు
తోడుగా ఉండును.
9కావున–నీవేల నన్ను మరచియున్నావు?
శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ
వలసి వచ్చెనేమి అని
నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి
చేయుచున్నాను.
10–నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల
అడుగుచున్నారు.వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచుచున్నారు.
11నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు?
నాలో నీవేల తొందరపడుచున్నావు?
దేవునియందు నిరీక్షణ యుంచుము,
ఆయనే నా రక్షణకర్త నా దేవుడు
ఇంకను నేనాయనను స్తుతించెదను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in