కీర్తనలు 35
35
దావీదు కీర్తన.
1యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె
మాడుము
నాతో పోరాడువారితో పోరాడుము.
2కేడెమును డాలును పట్టుకొని
నా సహాయమునకై లేచి నిలువుము.
3ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము
–నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము.
4నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును
కలుగును గాక
నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింప
బడి లజ్జపడుదురు గాక.
5యెహోవాదూత వారిని పారదోలును గాకవారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు
గాక.
6యెహోవాదూత వారిని తరుమును గాకవారి త్రోవ చీకటియై జారుడుగానుండును గాక.
7నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో
తమ వల నొడ్డిరి
నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట
త్రవ్విరి.
8వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక
తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక
వాడు ఆ చేటులోనే పడును గాక.
9అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును
ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును.
10అప్పుడు–యెహోవా నీవంటివాడెవడు?
మించిన బలముగలవారి చేతినుండి దీనులను
దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడి
పించువాడవు నీవే అని నా యెముకలన్నియు
చెప్పుకొనును.
11కూటసాక్షులు లేచుచున్నారు
నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు.
12మేలునకు ప్రతిగా నాకు కీడుచేయుచున్నారు
నేను దిక్కులేనివాడనైతిని.
13వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని
ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు
కొంటిని
అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి
యున్నది.
14అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును
నేను నడుచుకొంటిని
తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు
వానివలె క్రుంగుచుంటిని.
15నేను కూలియుండుట చూచి వారు సంతోషించి
గుంపుకూడిరి
నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి
మానక నన్ను నిందించిరి.
16విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలెవారు నా మీద పండ్లుకొరికిరి.
17ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు?వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం
పుము
నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము
18అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను
బహుజనులలో నిన్ను నుతించెదను.
19నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని
నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము
నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీట
నియ్యకుము.
20వారు సమాధానపు మాటలు ఆడరు
దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు
కపటయోచనలు చేయుదురు.
21నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు
కొనుచున్నారు.
–ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి
నదే అనుచున్నారు.
22యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన
ముగా నుండకుము
నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.
23నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము
నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యె
మాడుటకు లెమ్ము.
24యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము
తీర్చుము
నన్నుబట్టి వారు సంతోషింపకుందురు గాక.
25–ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అను
కొనకపోదురు గాక
–వాని మ్రింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు
గాక
26నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ
మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక
నా మీద అతిశయపడువారు
సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక
27నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు
ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక
–తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు
యెహోవా ఘనపరచబడును గాక అని వారు
నిత్యము పలుకుదురు.
28నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు
దినమెల్ల సల్లాపములు చేయును.
Currently Selected:
కీర్తనలు 35: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.