కీర్తనలు 34
34
దావీదు అబీమెలెకు ఎదుట వెఱ్ఱివానివలె ప్రవర్తించి అతనిచేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన.
1నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను.
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
2యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను.
దీనులు దానిని విని సంతోషించెదరు.
3నాతోకూడి యెహోవాను ఘనపరచుడి
మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప
చేయుదము.
4నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన
నాకుత్తరమిచ్చెను
నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను
తప్పించెను.
5వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెనువారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును.
6ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను
అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.
7యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు
ఆయనదూత కావలియుండి వారిని రక్షించును
8యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి
ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.
9యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు
ఉంచుడి.
ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు
కొదువలేదు.
10సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును
యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై
యుండదు.
11పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి.
యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.
12బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?
మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువా
డెవడైన నున్నాడా?
13చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను
కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము.
14కీడుచేయుట మాని మేలుచేయుము
సమాధానము వెదకి దాని వెంటాడుము.
15యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది.
ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.
16దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద
నుండి కొట్టివేయుటకై
యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.
17నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించునువారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.
18విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు
నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.
19నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు
వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపిం
చును.
20ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును
వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు.
21చెడుతనము భక్తిహీనులను సంహరించును
నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచ
బడుదురు
22యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును
ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధు
లుగా ఎంచబడరు.
Currently Selected:
కీర్తనలు 34: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.