YouVersion Logo
Search Icon

కీర్తనలు 141

141
దావీదు కీర్తన.
1యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను
నాయొద్దకు త్వరపడి రమ్ము
నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము
2నా ప్రార్థన ధూపమువలెను
నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను
నీ దృష్టికి అంగీకారములగును గాక.
3యెహోవా, నా నోటికి కావలియుంచుము
నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.
4పాపము చేయువారితోకూడ
నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు
నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుమువారి రుచిగల పదార్థములు నేను తినకయుందును
గాక.
5నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమువారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము
నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక.వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన
చేయుచున్నాను.
6వారి న్యాయాధిపతులు కొండ పేటుమీదనుండి పడ
ద్రోయబడుదురు.
కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని
అంగీకరించుచున్నారు.
7ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు
మాయెముకలు పాతాళద్వారమున చెదరియున్నవి.
8యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు
చూచుచున్నవి
నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయ
కుము.
9నా నిమిత్తము వారు ఒడ్డిన వలనుండి
పాపము చేయువారి ఉచ్చులనుండి నన్ను తప్పించి
కాపాడుము.
10నేను తప్పించుకొని పోవుచుండగా
భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 141