YouVersion Logo
Search Icon

కీర్తనలు 140

140
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.
1యెహోవా, దుష్టుల చేతిలోనుండి నన్ను విడి
పింపుము
బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను
కాపాడుము.
2వారు తమ హృదయములలో అపాయకరమైన యోచ
నలు చేయుదురువారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు.
3పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి
చేయుదురువారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)
4యెహోవా, భక్తిహీనులచేతిలోపడకుండ నన్ను
కాపాడుము.
బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను
రక్షింపుము.
నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దే
శించుచున్నారు.
5గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారువారు త్రోవప్రక్కను వల పరచియున్నారు.
నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.)
6అయినను నేను యెహోవాతో ఈలాగు మనవిచేయు
చున్నాను
–యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు
చెవియొగ్గుము.
7ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము
యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు.
8యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుమువారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొన
సాగింపకుము. (సెలా.)
9నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడలవారి పెదవుల చేటు వారిని ముంచును గాక
10కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాకవారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు
కూల్చబడుదురుగాక
అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక
11కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక
ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును
గాక.
12బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడు
ననియు
దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు
నేనెరుగుదును.
13నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞ
తాస్తుతులు చెల్లించెదరు
యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 140