YouVersion Logo
Search Icon

కీర్తనలు 132

132
యాత్రకీర్తన.
1యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని
పక్షమున జ్ఞాపకము చేసికొనుము.
2అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట
యిచ్చి
3-5యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను.
ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు
యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను
చూచువరకు
నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను
నేను పరుండు మంచముమీది కెక్కను
నా కన్నులకు నిద్ర రానియ్యను
నా కను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.
6అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి
యాయరు పొలములలో అది దొరికెను.
7ఆయన నివాసస్థలములకు పోదము రండి
ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి.
8యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో
కూడ రమ్ము
నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.
9నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక
నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక.
10నీ సేవకుడైన దావీదు నిమిత్తము
నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము.
11–నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియ
మింతును.
నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల
నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించినయెడల
వారి కుమారులు కూడ నీ సింహాసనముమీద నిత్యము
కూర్చుందురని
12యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను
ఆయన మాట తప్పనివాడు.
13యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు.
తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.
14ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ
స్థానముగానుండును
ఇక్కడనే నేను నివసించెదను
15దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను
దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను
16దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప
జేసెదను
దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు.
17అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను
నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి
యున్నాను.
18అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను
అతని కిరీటము అతనిమీదనేయుండి తేజరిల్లును అనెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 132