YouVersion Logo
Search Icon

కీర్తనలు 104

104
1నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.
యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన
వాడవు
నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు.
2వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు.
తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి
యున్నావు.
3జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు.
మేఘములను తనకు వాహనముగా చేసికొని
గాలి రెక్కలమీద గమనముచేయుచున్నాడు
4వాయువులను తనకు దూతలుగాను#104:4 తన దూతలను వాయువులుగాను.
అగ్నిజ్వాలలను#104:4 తన సేవకులను అగ్నిజ్వాలలుగాను. తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు.
5భూమి యెన్నటికిని కదలకుండునట్లు
ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.
6దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె
కప్పితివి.
కొండలకుపైగా నీళ్లు నిలిచెను.
7నీవు గద్దింపగానే అవి పారిపోయెను
నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను.
8నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై
అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.
9అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు
అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.
10ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును
అవి మన్యములలో పారును.
11అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును.
వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును.
12వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును
కొమ్మల నడుమ అవి సునాదము చేయును.
13తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారల
నిచ్చును
నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది.
14పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర
మొక్కలను
ఆయన మొలిపించుచున్నాడు
15అందుమూలమున భూమిలోనుండి ఆహారమును
నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును
వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును
నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన
పుట్టించుచున్నాడు
16యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి.
ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు
తృప్తిపొందుచున్నవి.
17అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును
అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయుచున్నవి.
18గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు
కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు
19ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియ
మించెను
సూర్యునికి తన అస్తమయకాలము తెలియును
20నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది
అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి.
21సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి
తమ ఆహారమును దేవుని చేతిలోనుండి తీసికొన
జూచుచున్నవి.
22సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి
తమ గుహలలో పండుకొనును.
23సాయంకాలమువరకు పాటుపడి తమ పనులను జరుపు
కొనుటకై మనుష్యులు బయలువెళ్లుదురు.
24యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా
నున్నవి !
జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి
నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.
25అదిగో విశాలమైన మహాసముద్రము
అందులో లెక్కలేని జలచరములు
దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి.
26అందులో ఓడలు నడుచుచున్నవి
దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము
లున్నవి.
27తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని
ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి
28నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును
నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి
పరచబడును.
29నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును
నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు
విడిచి మంటి పాలగును.
30నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును
అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.
31యెహోవా మహిమ నిత్యముండునుగాక.
యెహోవా తన క్రియలను చూచి ఆనందించును
గాక.
32ఆయన భూమిని చూడగా అది వణకును
ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును
33నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు
పాడెదను
నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను.
34ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగానుండునుగాక
నేను యెహోవాయందు సంతోషించెదను.
35పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక
భక్తిహీనులు ఇక నుండకపోదురు గాక
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము
యెహోవాను స్తుతించుడి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 104