కీర్తనలు 103
103
దావీదు కీర్తన.
1నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.
నా అంతరంగముననున్న సమస్తమా,
ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
2నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము
3ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు
నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.
4సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు
చున్నాడు
కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు
చున్నాడు
5పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగు
చుండునట్లు
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
6యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడువారికందరికి న్యాయము తీర్చును
7ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను
ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను
8యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు
దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు.
9ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు
ఆయన నిత్యము కోపించువాడు కాడు.
10మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు
మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.
11భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో
ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన
కృప అంత అధికముగా ఉన్నది.
12పడమటికి తూర్పు ఎంత దూరమో
ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర
పరచియున్నాడు.
13తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు
యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల
జాలిపడును.
14మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది
మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను
చున్నాడు.
15నరుని ఆయువు గడ్డివలె నున్నది
అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.
16దానిమీద గాలి వీచగా అది లేకపోవును
ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.
17ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస
రించి నడచుకొను వారిమీద
యెహోవాయందు భయభక్తులు గలవారిమీద
18ఆయన కృప యుగయుగములు నిలుచును
ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.
19యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిర
పరచియున్నాడు.
ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలనచేయుచున్నాడు.
20యెహోవాదూతలారా,
ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు
బలశూరులారా,
ఆయనను సన్నుతించుడి.
21యెహోవా సైన్యములారా,
ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా,
మీరందరు ఆయనను సన్నుతించుడి.
22యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న
ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతిం
చుడి.
Currently Selected:
కీర్తనలు 103: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.