YouVersion Logo
Search Icon

కీర్తనలు 102

102
దుఃఖముచేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొఱ్ఱ.
1యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము
నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము.
2నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము
నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి
నాకుత్తర మిమ్ము.
3పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి
పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి
పోయి యున్నవి.
4ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి
పోయి యున్నది
భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.
5నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహ
మునకు అంటుకొనిపోయినవి.
6నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను
పాడైన స్థలములలోని పైడికంటెవలె నున్నాను.
7రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా
నున్న పిచ్చుకవలె నున్నాను.
8దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు
నామీద వెఱ్ఱికోపముగలవారు నా పేరు చెప్పి శపిం
తురు.
9నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు
బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను.
10నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను.
నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు.
11నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి
గడ్డివలె నేను వాడియున్నాను.
12యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ
నామస్మరణ తరతరము లుండును.
13నీవు లేచి సీయోనును కరుణించెదవు.
దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను
నిర్ణయకాలమే వచ్చెను.
14దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములువారు దాని మంటిని కనికరించుదురు
15అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును
భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు
16ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు
ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను
17ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపకవారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.
18యెహోవాను సేవించుటకై జనములును
రాజ్యములును కూర్చబడునప్పుడు
19మనుష్యులు సీయోనులో యెహోవా నామఘనతను
యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించు
నట్లు
20చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును
చావునకు విధింపబడినవారిని విడిపించుటకును
21ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునుండి వంగి చూచెననియు
ఆకాశమునుండి భూమిని దృష్టించెననియు
22వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ
వలెను
సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును
23నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము
క్రుంగజేసెను
నా దినములు కొద్దిపరచెను.
24నేనీలాగు మనవిచేసితిని–నా దేవా, నాదినముల
మధ్యను నన్ను కొనిపోకుము
నీ సంవత్సరములు తరతరములుండును.
25ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి
ఆకాశములు కూడ నీ చేతిపనులే.
26అవి నశించును గాని నీవు నిలచియుందువు
అవియన్నియు వస్త్రమువలె పాతగిలును
ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని
తీసివేయుదువు అవి మార్చబడును.
27నీవు ఏకరీతిగా నుండువాడవు
నీ సంవత్సరములకు అంతము లేదు.
28నీ సేవకుల కుమారులు నిలిచియుందురువారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in