YouVersion Logo
Search Icon

కీర్తనలు 101

101
దావీదు కీర్తన.
1నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు
పాడెదను
యెహోవా, నిన్ను కీర్తించెదను.
2నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను.
నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు?
నా యింట యథార్థహృదయముతో నడుచుకొం
దును
3నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు
కొనను
భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్య
ములు అవి నాకు అంటనియ్యను
4మూర్ఖచిత్తుడు నా యొద్దనుండి తొలగిపోవలెను
దౌష్ట్యమును నేననుసరింపను.
5తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను
సంహరించెదను
అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము
గలవారిని నేను సహింపను
6నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైనవారిని నేను కనిపెట్టుచున్నాను
నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకు
లగుదురు.
7మోసము చేయువాడు నా యింట నివసింపరాదు
అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.
8యెహోవా పట్టణములోనుండి
పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై
దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను
సంహరించెదను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in