YouVersion Logo
Search Icon

సామెతలు 6

6
1నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన
యెడల
పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల
2నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు
నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు
3నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి.
నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని
బలవంతము చేయుము.
ఈలాగు చేసి తప్పించుకొనుము
4నీ కన్నులకు నిద్రయైనను
నీ కనురెప్పలకుకునుకుపాటైనను రానియ్యకుము.
5వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును
ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును
తప్పించుకొనుము.
6సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము
వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.
7వాటికి న్యాయాధిపతి లేకున్నను
పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను
8అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును
కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.
9సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు?
ఎప్పుడు నిద్రలేచెదవు?
10ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని
కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని
నీవనుచుందువు
11అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్యము
నీయొద్దకు వచ్చును.
ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.
12కుటిలమైన మాటలు పలుకువాడు
పనికిమాలినవాడును దుష్టుడునై యున్నాడు
13వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును
వ్రేళ్లతో గురుతులు చూపును.
14వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది
వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.
15కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును
వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే నలుగగొట్టబడును.
16యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు
ఏడును ఆయనకు హేయములు
17అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు
నిరపరాధులను చంపు చేతులును
18దుర్యోచనలు యోచించు హృదయమును
కీడుచేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును
19లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు
అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
20నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము
నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.
21వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము
నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.
22నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును
నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును.
నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.
23ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును.
శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
24చెడు స్త్రీయొద్దకు పోకుండను
పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను
అవి నిన్ను కాపాడును.
25దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము
అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన
నియ్యకుము.
26వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక
మాత్రము మిగిలియుండును.
మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.
27ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల
వాని వస్త్రములు కాలకుండునా?
28ఒకడు నిప్పులమీద నడిచినయెడల
వాని పాదములు కమలకుండునా?
29తన పొరుగువాని భార్యను కూడువాడు ఆప్రకారమే
నాశనమగును
ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.
30దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన
యెడల
యెవరును వాని తిరస్కరింపరు గదా.
31వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను
తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను.
32జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు
ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే
33వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును
వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.
34భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది
ప్రతికారముచేయు కాలమందు అట్టివాడు కనికర
పడడు.
35ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు
ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for సామెతలు 6