యోబు 6
6
1దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను–
2నా దుఃఖము చక్కగా తూచబడును గాక
దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో
పెట్టబడును గాక.
3ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రముల
ఇసుకకన్న బరువుగా కనబడును.
అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.
4సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను
వాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నది
దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై
పంక్తులు తీరుచున్నవి.
5అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?
ఎద్దు మేత చూచి రంకెవేయునా?
6ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డు
లోని తెలుపులో రుచికలదా?
7నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను
అవియే నాకు భోజనపదార్థములాయెను.
8ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక
నేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక
9దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాక
చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును
గాక.
10అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొన
కుండ లేదని నేను ఆదరణ పొందుదును
మరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి
హర్షించుదును
11నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?
నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?
12నా బలము రాళ్ల బలమువంటిదా?
నా శరీరము ఇత్తడిదా?
13నాలో త్రాణ యేమియు లేదు గదా.
శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా.
14క్రుంగిపోయినవాడు
సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను
స్నేహితుడు వానికి దయచూపతగును.
15నా స్నేహితులు ఎండిన వాగువలెను
మాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడనివారైరి.
16మంచుగడ్డలుండుటవలనను
హిమము వాటిలో పడుటవలనను
అవి మురికిగా కనబడును
17వేసవి రాగానే అవి మాయమై పోవును
వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.
18వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియు
లేకుండ అవి యింకిపోవును.
19సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు
వాటిని వెదకుదురు
షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు.
20వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు
వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు.
21అటువలె మీరు లేనట్టుగానే యున్నారు
మీరు ఆపదను చూచి భయపడుచున్నారు.
22–ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా?
మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని
యడిగితినా?
23పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా?
బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని
యడిగితినా?
24నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను
ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు
తెలియజేయుడి.
25యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి
అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?
26మాటలను గద్దించుదమని మీరనుకొందురా?
నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా.
27మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు,
మీ స్నేహితులమీద బేరము సాగింతురు.
28దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుట
నేను అబద్ధమాడుదునా?
29అన్యాయములేకుండ నా సంగతి మరల విచారించుడి
మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.
30నా నోట అన్యాయముండునా?
దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?
Currently Selected:
యోబు 6: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.