యోబు 5
5
1నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా?
పరిశుద్ధదూతలలో ఎవనితట్టు తిరుగుదువు?
2దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశించెదరు
బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు.
3మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను
అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమని
కనుగొంటిని.
4అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు
గుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు.
5ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురు
ముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురు
బోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి
6శ్రమ ధూళిలోనుండి పుట్టదు.
బాధ భూమిలోనుండి మొలవదు.
7నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవము
నకే పుట్టుచున్నారు.
8అయితే నేను దేవుని నాశ్రయించుదును.
దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.
9ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను
లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.
10ఆయన భూమిమీద వర్షము కురిపించువాడు
పొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు.
11అట్లు ఆయన దీనులను ఉన్నతస్థలములలో నుంచును
దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును.
12వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండ
ఆయన వారి ఉపాయములను భంగపరచును
13జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును
కపటుల ఆలోచనను తలక్రిందుచేయును
14పగటివేళ వారికి అంధకారము తారసిల్లును
రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్నకాలమునవారు తడవులాడుదురు
15బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారి చేతిలోనుండి
ఆయన దరిద్రులను రక్షించును.
16కావున బీదలకు నిరీక్షణ కలుగును
అక్రమము నోరు మూసికొనును.
17దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు
కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము.
18ఆయన గాయపరచి గాయమును కట్టును
ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థ
పరచును.
19ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును
ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.
20క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గ
బలమునుండియు ఆయన నిన్ను తప్పించును.
21నోటిమాటలచేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన
నిన్ను చాటుచేయును
ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు.
22పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని
యుందువు
అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును.
23ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని
నిర్లక్ష్యము చేయుదువు
అడవిమృగములకు నీవు ఏమాత్రమును భయపడవు
24నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండును
నీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు
పోయి యుండదు.
25మరియు నీ సంతానము విస్తారమగుననియు
నీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదు
రనియు నీకు తెలియును.
26వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు
పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.
27మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది
ఆలాగే యున్నది.
ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము.
Currently Selected:
యోబు 5: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.