YouVersion Logo
Search Icon

యోబు 41

41
1నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? .
దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
2నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా?
దాని దవడకు గాలము ఎక్కింపగలవా?
3అది నీతో విన్నపములు చేయునా?
మృదువైన మాటలు నీతో పలుకునా?
4నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు
అది నీతో నిబంధనచేయునా?
5నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆట
లాడెదవా?
నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా?
6బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా?వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము
చేయుదురా?
7దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా?
దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా?
8దానిమీద నీ చెయ్యి వేసి చూడుము
దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనిన
యెడల
నీవు మరల ఆలాగున చేయకుందువు.
9దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచు
కొందుమన్న ఆశ విడిచెదరు
దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను
గుండెలు అవిసిపోవును గదా.
10దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు.
అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు?
11నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను
ఏమైనను ఇచ్చెనా?
ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే
గదా
12దాని అవయవములనుగూర్చియైనను దాని మహాబల
మునుగూర్చియైనను దాని చక్కని తీరునుగూర్చి
యైనను పలుకక మౌనముగా నుండను.
13ఎవడైన దాని పై కవచమును లాగివేయగలడా?
దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా?
14దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు?
దాని పళ్లచుట్టు భయకంపములు కలవు
15దాని గట్టిపొలుసులు దానికి అతిశయాస్పదము
ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతనచేయబడి
యున్నవి.
16అవి ఒకదానితో ఒకటి హత్తుకొని యున్నవి.
వాటి మధ్యకు గాలి యేమాత్రమును జొరనేరదు.
17ఒకదానితో ఒకటి అతకబడి యున్నవి
భేదింప శక్యము కాకుండ అవి యొకదానితో నొకటి
కలిసికొని యున్నవి.
18అది తుమ్మగా వెలుగు ప్రకాశించును
దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలె నున్నవి
19దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును
అగ్ని కణములు దానినుండి లేచును.
20ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగు
చున్న బానలోనుండి పొగ లేచునట్లు
దాని నాసికారంధ్రములలోనుండి లేచును.
21దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును
దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును
22దాని మెడ బలమునకు స్థానము
భయము దానియెదుట తాండవమాడుచుండును
23దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది
అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి
రాదు.
24దాని గుండె రాతివలె గట్టిగా నున్నది
అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము.
25అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు
అధిక భయముచేత వారు మైమరతురు.
26దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే
ఈట్లైనను బాణములైనను పంట్రకోలలైనను అక్కరకు రావు.
27ఇది ఇనుమును గడ్డిపోచగాను
ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును.
28బాణము దానిని పారదోలజాలదు
వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి.
29దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును
అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.
30దాని క్రిందిభాగములు కరుకైన చిల్లపెంకు లవలె ఉన్నవి.
అది బురదమీద నురిపిడికొయ్యవంటి తన దేహమును
పరచుకొనును.
31కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ
జేయును
సముద్రమును తైలమువలె చేయును.
32అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింప
జేయును
చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా
తోచును.
33అది భయములేనిదిగా సృజింపబడినది
భూమిమీద దానివంటిదేదియు లేదు.
34అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును
గర్వించిన జంతువులన్నిటికి అది రాజు.

Currently Selected:

యోబు 41: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in