యోబు 40
40
1మరియు యెహోవా యోబునకు ఈలాగు .
ప్రత్యుత్తరమిచ్చెను–
2ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో
వాదింపవచ్చునా?
దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర
మియ్యవలెను.
3అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున
ప్రత్యుత్తరమిచ్చెను–
4చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని
ప్రత్యుత్తరమిచ్చెదను?
నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.
5ఒక మారుమాటలాడితిని నేను మరల నోరెత్తను.
రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను.
6అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు
యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను–
7పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము
నేను నీకు ప్రశ్నవేసెదను నీవు ప్రత్యుత్తరమిమ్ము.
8నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా?
నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అప
రాధము మోపుదువా?
9దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా?
ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింప
గలవా?
10ఆడంబర మహాత్మ్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము
గౌరవప్రభావములను ధరించుకొనుము.
11నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము
గర్విష్ఠులైన వారినందరిని చూచి వారిని క్రుంగజేయుము.
12గర్విష్ఠులైన వారిని చూచి వారిని అణగగొట్టుము
దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగ
ద్రొక్కుము.
13కనబడకుండ వారినందరిని బూడిదెలో పాతిపెట్టుము
సమాధిలో వారిని బంధింపుము.
14అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను
నిన్నుగూర్చి ఒప్పుకొనెదను.
15నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు
గదా
ఎద్దువలె అది గడ్డి మేయును.
16దాని శక్తి దాని నడుములో ఉన్నది
దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది.
17దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను
వంచును
దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి
యున్నవి.
18దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి
దాని ప్రక్క టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి
19అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది
దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను.
20పర్వతములలో దానికి మేత మొలచును
అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును.
21తామర చెట్లక్రిందను
జమ్ముగడ్డి మరుగునను పఱ్ఱలోను అది పండుకొనును
22తామరచెట్ల నీడను అది ఆశ్రయించును
నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును.
23నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు
యొర్దానువంటి ప్రవాహము పొంగి దానినోటియొద్దకు
వచ్చినను అది ధైర్యము విడువదు.
24అది చూచుచుండగా ఎవరైన దానిని పట్టుకొనగలరా?
ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా?
Currently Selected:
యోబు 40: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.