న్యాయాధిపతులు 5
5
1ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి.
2ఇశ్రాయేలీయులలోయుద్ధశాలులు ధైర్యము కనుపరచిరి
ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను
స్తుతించుడి.
3రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి
యెహోవాకు గానముచేసెదను.
4ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను
యెహోవా, నీవు శేయీరునుండి బయలుదేరినప్పుడు
ఎదోము పొలమునుండి బయలుదేరినప్పుడు
భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను
మేఘములును వర్షించెను.
5యెహోవా సన్నిధిని కొండలలోనుండి ప్రవాహములు
వచ్చెను
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాసన్నిధిని
సీనాయిలోనుండి ప్రవాహములు వచ్చెను.
6అనాతు కుమారుడైన షమ్గరు దినములలో
యాయేలు దినములలో రాజమార్గములు ఎడారు
లాయెను
ప్రయాణస్థులు చుట్టుత్రోవలలోనే నడిచిరి.
7ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి#5:7 గ్రామములు నిర్జనములాయెను.
దెబోరా అను నేను రాకమునుపు
ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపువారు లేకపోయిరి#5:7 అవి నిర్జనములాయెను.
8ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా
యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను
ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి
ఒక కేడెమేగాని యీటెయేగాని కనబడలేదు.
9జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి.వారియందు నాకు ప్రేమకలదు
యెహోవాను స్తుతించుడి.
10తెల్లగాడిదల నెక్కువారలారా,
తివాసులమీద కూర్చుండువారలారా,
త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రక
టించుడి.
11విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు
నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు
యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు
ఇశ్రాయేలు గ్రామములలో ఆయన జరిగించు
నీతి క్రియలను వారు ప్రకటించెదరు
వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు.
12దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము
దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము
బారాకూ, కీర్తన పాడుము
అబీనోయము కుమారుడా, లెమ్ము చెరపెట్టిన వారిని చెరపట్టుము.
13ప్రజలవీరులలో శేషించినవారును కూడి వచ్చిరి
శూరులలో యెహోవా నాకు సహాయము చేయ వచ్చెను.
14అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులును
నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులును
మాకీరునుండి న్యాయాధిపతులును
జెబూలూనీయులనుండి నాయకదండము వహించువారును వచ్చిరి.
15ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి.
ఇశ్శాఖారీయులును బారాకును
అతివేగమున లోయలోనికి చొరబడిరి
రూబేనీయుల కాలువలయొద్ద
జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను.
16మందల యీలలను వినుటకు
నీ దొడ్లమధ్యను నీవేల నివసించితివి?
రూబేనీయుల కాలువలయొద్ద
జనులకు గొప్ప యోచనలు కలిగెను.
17గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను
దానీయులు ఓడలదగ్గర ఏల నిలిచిరి?
ఆషేరీయులు సముద్రతీరమున తమ అఖాతములయొద్ద
ఏల నిలిచిరి?
18జెబూలూనీయులు మరణభయము లేక
ప్రాణము తృణీకరించుకొనిన జనము
నఫ్తాలీయులు భూమి మెట్టలమీద ప్రాణము తృణీక
రించిరి.
19రాజులు వచ్చి యుద్ధముచేసిరి.
మెగిద్దో కాలువలయొద్దనున్న తానాకులో
కనాను రాజులు యుద్ధముచేసిరి.
వెండి లాభము వారు తీసికొనలేదు
20నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను
నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో
యుద్ధముచేసెను.
21కీషోను వాగువెంబడి పురాతనపు వాగైన కీషోను
వెంబడివారు కొట్టుకొనిపోయిరి.
నా ప్రాణమా నీవు బలముపూని సాగుము.
22గుఱ్ఱముల డెక్కలు శూరులను త్రొక్కెను
గుఱ్ఱములు ఎగసి యెగసి శూరులను త్రొక్కెను.
23యెహోవాదూత యిట్లనెను
–మేరోజును శపించుడి
దాని నివాసులమీద మహా శాపము నిలుపుడి
యెహోవా సహాయమునకు వారు రాలేదు
బలిష్ఠులతోకూడి యెహోవా సహాయమునకు వారు
రాలేదు.
24కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు
స్త్రీలలో దీవెననొందును
గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెన
నొందును.
25అతడు దాహమడిగెను
ఆమె పాలు తెచ్చియిచ్చెను
సర్దారులకు తగిన పాత్రతో మీగడ దెచ్చియిచ్చెను
ఆమె మేకును చేతపట్టుకొనెను
26పనివాని సుత్తెను కుడిచేతపట్టుకొని సీసెరాను
కొట్టెను
వాని తలను ఆమె పగులగొట్టెను
ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను.
27అతడు ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడి పరుండెను
ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడెను
అతడు ఎక్కడ క్రుంగెనో అక్కడనే పడిచచ్చెను.
28సీసెరా తల్లి కిటికీలోనుండి చూచెను
అల్లిక కిటికీలోనుండి చూచి కేకలు వేసెను
రాక, అతని రథము తడవుచేయనేల?
అతని రథముల చక్రములు ఆలస్యముచేయనేల?
29ఆమెయొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు
ఈలాగుననే ఉత్తరమిచ్చిరి.
ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను–
30వారికి దొరకెను గదా? దోపుడుసొమ్ము పంచుకొనుచున్నారు గదా?
యోధులందరు తలాయొక స్త్రీని తీసికొందురు
ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు
సీసెరాకు రంగువేయబడిన వస్త్రమొకటి
దోపుడు సొమ్ముగా దొరకును
రంగువేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా
దొరకును
రెండువైపుల రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము
దోచుకొనినవారి మెడలకు తగిన వస్త్రమొకటి
దొరకును.
31యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశించెదరు
ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు
సూర్యునివలె నుందురు అనిపాడిరి.
తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.
Currently Selected:
న్యాయాధిపతులు 5: TELUBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.