యెషయా 66
66
1యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు
ఆకాశము నా సింహాసనము
భూమి నా పాద పీఠము
మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది?
నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది
ఏపాటిది?
2అవన్నియు నా హస్తకృత్యములు
అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు
చున్నాడు.
ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట
విని వణకుచుండునో
వానినే నేను దృష్టించుచున్నాను.
3ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే
గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను
విరుచువానివంటివాడే
నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని
వంటివాడే
ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి
వాడే.వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరివారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగా
ఉన్నవి.
4నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేక
పోయెను
నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేక
పోయెను
నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి
నాకిష్టము కానిదాని కోరుకొనిరి
కావున నేనును వారిని మోసములో ముంచుదునువారు భయపడువాటిని వారిమీదికి రప్పించెదను.
5యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన
మాట వినుడి
మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును
త్రోసివేయు మీ స్వజనులు
–మీ సంతోషము మాకు కనబడునట్లు
యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు
వారే సిగ్గునొందుదురు.
6ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది
దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది
తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు
యెహోవా శబ్దము వినబడుచున్నది.
7ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది
నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది.
8అట్టివార్త యెవరు వినియుండిరి?
అట్టి సంగతులు ఎవరు చూచిరి?
ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన
చాలునా?
ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా?
సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను
కనెను.
9నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా?
అని యెహోవా అడుగుచున్నాడు.
పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా? అని
నీ దేవుడడుగుచున్నాడు.
10యెరూషలేమును ప్రేమించువారలారా,
మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి.
ఆమెనుబట్టి దుఃఖించువారలారా,
మీరందరు ఆమెతో ఉత్సహించుడి
11ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి
నొందెదరు
ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించె
దరు.
12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు
పారజేయుదును
మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు
ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె
మీయొద్దకు దానిని రాజేతును
మీరు చంకను ఎత్తికొనబడెదరు
మోకాళ్లమీద ఆడింపబడెదరు.
13ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద
రించెదను
యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.
14మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును
మీ యెముకలు లేతగడ్డివలె బలియును
యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను
పరచబడును
ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.
15ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుట
కును
అగ్నిజ్వాలలతో గద్దించుటకును
యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు
ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి.
16అగ్ని చేతను తన ఖడ్గముచేతను
శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడును
యెహోవాచేత అనేకులు హతులవుదురు.
17తోటలోనికి వెళ్లవలెనని మధ్యనిలుచున్న యొకని
చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు
కొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తు
వును పందికొక్కులను తినువారును
ఒకడును తప్పకుండ నశించెదరు
ఇదే యెహోవా వాక్కు.
18వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి
అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట
లాడువారిని సమకూర్చెదనువారు వచ్చి నా మహిమను చూచెదరు.
19నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదనువారిలో తప్పించుకొనినవారిని
విలుకాండైన తర్షీషు పూలు లూదు అను జనులయొద్ద
కును
తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపె
దను
నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహి
మను చూడనట్టియు
దూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదనువారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.
20ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్య
మును
యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా
గుఱ్ఱములమీదను రథములమీదను
డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను
ఎక్కించి
సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు
యెరూషలేమునకు
మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగావారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చు
చున్నాడు.
21మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై
నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును
అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–
22నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త
భూమియు
లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు
నీ సంతతియు నీ నామమును నిలిచియుండును
ఇదే యెహోవా వాక్కు.
23ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినము
నను
నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చె
దరు
అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
24వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబర
ములను తేరి చూచెదరు
వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు
అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.
Currently Selected:
యెషయా 66: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.