యెషయా 65
65
1నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు .
రానిచ్చితిని
నన్ను వెదకనివారికి నేను దొరికితిని.
–నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు
పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.
2తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు
కొనుచు
లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు
చాపుచున్నాను.
3వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల
మీద ధూపము వేయుదురు
నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు.
4వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో
ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు
అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి
5వారు–మా దాపునకురావద్దు ఎడముగా ఉండుము
నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు;
వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను
దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు.
6యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–నా యెదుట గ్రంథములో అది వ్రాయబడి
యున్నది
ప్రతికారముచేయక నేను మౌనముగా నుండను
నిశ్చయముగా వారనుభవించునట్లు నేను వారికి ప్రతి
కారము చేసెదను.
7నిశ్చయముగా మీ దోషములనుబట్టియు మీపితరుల
దోషములనుబట్టియు
అనగా పర్వతములమీద ఈ జనులు ధూపమువేసిన
దానినిబట్టియు
కొండలమీద నన్ను దూషించినదానినిబట్టియు
మొట్టమొదట వారి ఒడిలోనేవారి ప్రతికారము కొలిచి పోయుదును.
8యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–ద్రాక్షగెలలో క్రొత్తరసము కనబడునప్పుడు
జనులు–ఇది దీవెనకరమైనది దాని కొట్టివేయకుము
అని చెప్పుదురు గదా?
నా సేవకులనందరిని నేను నశింపజేయకుండునట్లువారినిబట్టి నేనాలాగే చేసెదను.
9యాకోబునుండి సంతానమును యూదానుండి నా
పర్వతములను స్వాధీనపరచుకొనువారిని పుట్టించె
దను
నేను ఏర్పరచుకొనినవారు దాని స్వతంత్రించు
కొందురు
నా సేవకులు అక్కడ నివసించెదరు.
10నన్నుగూర్చి విచారణచేసిన నా ప్రజలనిమిత్తము
షారోను గొఱ్ఱెల మేతభూమియగును
ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా
ఉండును.
11యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి
గాదునకు#65:11 లేక, అదృష్టమునకు – ఆది. 30:11. బల్లను సిద్ధపరచువారలారా,
అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా,
నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు
12నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి
చెడ్డదైనదాని చేసితిరి
నాకిష్టము కానిదాని కోరితిరి
నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును
మీరందరు వధకు లోనగుదురు.
13కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చు
చున్నాడు
–ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు
గాని మీరు ఆకలిగొనెదరు
నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనె
దరు.
నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు
14నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని
మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు
మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.
15నేనేర్పరచుకొనినవారికి మీ పేరు శాపవచనముగా
చేసిపోయెదరు
ప్రభువగు యెహోవా నిన్ను హతముచేయును
ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును.
16దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరు
వాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని
కోరుకొనును
దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని
తోడని ప్రమాణము చేయును
పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును
అవి నా దృష్టికి మరుగవును.
17ఇదిగో నేను క్రొత్త ఆకాశమును
క్రొత్త భూమిని సృజించుచున్నాను
మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.
18నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు
హర్షించి ఆనందించుడి
నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన
స్థలముగాను
ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు
చున్నాను.
19నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను
నా జనులనుగూర్చి హర్షించెదను
రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన
బడవు.
20అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు
కాలమునిండని ముసలివారుండరు
బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని
పోవుదురు
పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు
సంవత్సరములు బ్రదుకును
21జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు
ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభ
వింతురు.
22వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరువారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు
నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును
నేను ఏర్పరచుకొనినవారు
తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ
వింతురు
23వారు వృథాగా ప్రయాసపడరు
ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను
కనరువారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురువారి సంతానపువారు వారియొద్దనే యుందురు.
24వారికీలాగున జరుగునువారు వేడుకొనకమునుపు నేను ఉత్తరమిచ్చెదనువారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను.
25తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును
సింహము ఎద్దువలె గడ్డి తినును
సర్పమునకు మన్ను ఆహారమగును
నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశన
మైనను చేయకుండును
అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Currently Selected:
యెషయా 65: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.