YouVersion Logo
Search Icon

యెషయా 51

51
1నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు
వారలారా, నా మాట వినుడి
మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలో
చించుడి
మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలో
చించుడి
2మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి
మిమ్మును కనిన శారాను ఆలోచించుడి
అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని
అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు
చేసితిని.
3యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు
దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి
దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు
దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగు
నట్లు చేయుచున్నాడు
ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు
సంగీతగానమును దానిలో వినబడును
4నా ప్రజలారా, నా మాట ఆలకించుడి
నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి.
ఉపదేశము నాయొద్దనుండి బయలుదేరును
జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియ
మింతును.
5నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది
నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది
నా బాహువులు జనములకు తీర్పుతీర్చును
ద్వీపవాసులు నాతట్టు చూచి నిరీక్షణ గలవా
రగుదురువారు నా బాహువును ఆశ్రయింతురు.
6ఆకాశమువైపు కన్నులెత్తుడి
క్రింద భూమిని చూడుడి
అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును
భూమి వస్త్రమువలె పాతగిలిపోవును
అందలి నివాసులు అటువలె#51:6 దోమలవలె. చనిపోవుదురు
నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు.
7నీతిననుసరించువారలారా, నా మాట వినుడి
నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా,
ఆలకించుడి#51:7 లేక, హృదయపూర్వకముగా నా బోధనను అనుసరించు జనులారా, ఆలకించుడి.
మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ
మాటలకు దిగులుపడకుడి.
8వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి
వేయును
బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని
కొరికివేయును
అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తర
తరములుండును.
9యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు
కొమ్ము
పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి
నట్లు లెమ్ము
రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే
గదా?
మకరమును పొడిచినవాడవు నీవే గదా?
10అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన
వాడవు నీవే గదా?
విమోచింపబడినవారు దాటిపోవునట్లు
సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు
నీవే గదా?
11యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో
సీయోనునకు తిరిగి వచ్చెదరు
నిత్యసంతోషము వారి తలలమీద ఉండునువారు సంతోషానందము గలవారగుదురు
దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.
12నేను నేనే మిమ్ము నోదార్చువాడను
చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు
భయపడుదువు?
13బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు
వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు,
ఆకాశములను వ్యాపింపజేసి
భూమి పునాదులనువేసిన యెహోవాను
నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా?
బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?
14క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును
అతడు గోతిలోనికి పోడు చనిపోడు
అతనికి ఆహారము తప్పదు.
15నేను నీ దేవుడనైన యెహోవాను
సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని
రేపువాడను నేనే.
సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు
పేరు.
16నేను ఆకాశములను స్థాపించునట్లును
భూమి పునాదులను వేయునట్లును
నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును
నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను
కప్పియున్నాను.
17యెరూషలేమా, లెమ్ము లెమ్ము
యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు
కొని త్రాగినదానా,
తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా,
నిలువుము.
18ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూప
గలవాడెవడును లేకపోయెను.
ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టు
కొనువాడెవడును లేకపోయెను.
19ఈ రెండు అపాయములు నీకు సంభవించెను
నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు?
పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను,
నేను నిన్నెట్లు ఓదార్చుదును?
నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు
దుప్పి వలలో చిక్కు పడినట్లు
వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు.
20యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోనువారు నిండియున్నారు.
21ద్రాక్షారసములేకయే మత్తురాలవై శ్రమపడినదానా,
ఈ మాట వినుము.
22నీ ప్రభువగు యెహోవా
తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు
సెలవిచ్చుచున్నాడు
–ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ
పాత్రను
నీ చేతిలోనుండి తీసివేసియున్నాను
నీవికను దానిలోనిది త్రాగవు.
23నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను
మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమనివారు నీతో చెప్పగా
నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు
దానిని వంచితివి గదావారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.

Currently Selected:

యెషయా 51: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in