యెషయా 50
50
1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
–నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక
ఎక్కడనున్నది?
నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని?
మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి
మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము
చేయబడెను.
2నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల?
నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల?
నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా?
విడిపించుటకు నాకు శక్తిలేదా?
నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును
నదులను ఎడారిగా చేయుదును
నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత
చచ్చిపోవును.
3ఆకాశమున చీకటి కమ్మజేయుచున్నాను
అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను
4అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు
కలుగునట్లు
శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి
యున్నాడు
శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి
యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.
5ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా
నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు
వినకుండ నేను తొలగిపోలేదు.
6కొట్టువారికి నా వీపును అప్పగించితిని
వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్ప
గించితిని
ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము
దాచుకొనలేదు
7ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు
గనుక నేను సిగ్గుపడలేదు
నేను సిగ్గుపడనని యెరిగి
నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని.
8నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై
యున్నాడు
నాతో వ్యాజ్యెమాడువాడెవడు?
మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము
నా ప్రతివాది యెవడు?
అతని నాయొద్దకు రానిమ్ము.
9ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును
నామీద నేరస్థాపనచేయువాడెవడు?
వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు
చిమ్మెట వారిని తినివేయును.
10మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట
వినువాడెవడు?
వెలుగులేకయే చీకటిలో నడచువాడు
యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని
నమ్ముకొనవలెను.
11ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీచుట్టు
పెట్టుకొనువారలారా,
మీ అగ్ని జ్వాలలో నడువుడి
రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి
నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది
మీరు వేదనగలవారై పండుకొనెదరు.
Currently Selected:
యెషయా 50: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.