యెషయా 25
25
1యెహోవా, నీవే నా దేవుడవు
నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించె
దను
నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుస
రించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు
నెరవేర్చితివి
2నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము
పాడుగాను
అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు
చేసితివి
అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.
3భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా
నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి
దరిద్రులకు కలిగినశ్రమలో వారికి శరణ్యముగాను
గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల
కుండ నీడగాను ఉంటివి.
4కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు
భీకరజనముల పట్టణస్థులు నీకు భయపడుదురు.
5ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు
అన్యుల ఘోషను అణచివేసితివి
మేఘచ్ఛాయవలన ఎండ అణచివేయబడునట్లు
బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును.
6ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా
సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు
చేయును
మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును
మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును
మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.
7సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును
సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము
మీద ఆయన తీసివేయును
8మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి
వేయును.
ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప
బిందువులను తుడిచివేయును
భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును
ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
9ఆ దినమున జనులీలాగు నందురు
–ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని
యున్న మన దేవుడు
మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే
ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.
10యెహోవా హస్తము ఈ పర్వతముమీద నిలుచును
పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు
మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు.
11ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లువారు దానిమధ్యను తమ చేతులను చాపుదురు
వారెన్ని తంత్రములు పన్నినను యెహోవావారి
గర్వమును అణచివేయును.
12మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను
ఆయన క్రుంగగొట్టును
వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలుచేయును.
Currently Selected:
యెషయా 25: TELUBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.