యెషయా 24
24
1ఆలకించుడి
యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు
ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు
దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.
2ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును
దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును
దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును
కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును
అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి
కలుగును
వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలు
గును.
3దేశము కేవలము వట్టిదిగా చేయబడును
అది కేవలము కొల్లసొమ్మగును.
యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు
4–దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది
లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది
భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు.
5లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించియున్నారు
కట్టడను మార్చి నిత్యనిబంధనను మీరియున్నారు.
దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను.
6శాపము దేశమును నాశనముచేయుచున్నది
దాని నివాసులు శిక్షకు పాత్రులైరి
దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు
కొద్దిగానే యున్నారు.
7క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది
ద్రాక్షావల్లి క్షీణించుచున్నది
సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచుచున్నారు.
తంబురల సంతోషనాదము నిలిచిపోయెను
8ఉల్లసించువారి ధ్వని మానిపోయెను
సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను.
9పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము
త్రాగరు
పానము చేయువారికి మద్యము చేదాయెను
10నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను
ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి
యున్నది.
11ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు
వేయుచున్నారు
సంతోషమంతయు అస్తమించెను
దేశములో ఆనందము లేదు.
12పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు
విరుగగొట్టబడెను.
13ఒలీవ చెట్టును దులుపునప్పుడును
ద్రాక్షఫలములకోత తీరినతరువాత పరిగె పండ్లను ఏరు
కొనునప్పుడును జరుగునట్లుగా
భూమిమధ్య జనములలో జరుగును.
14శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు
యెహోవా మహాత్మ్యమునుబట్టి సముద్రతీరమున నున్నవారు కేకలువేయుదురు.
15అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యెహో
వాను ఘనపరచుడి
సముద్ర ద్వీపవాసులారా,#24:15 లేక, పశ్చిమ. ఇశ్రాయేలు దేవుడైన
యెహోవా నామమును ఘనపరచుడి.
16నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమునుండి సంగీత
ములు మనకు వినబడెను.
అప్పుడు నేను–అయ్యో నాకు శ్రమ
నేను చెడిపోతిని చెడిపోతిని.
మోసము చేయువారు మోసము చేయుదురు
మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు.
17భూనివాసీ, నీమీదికి భయము వచ్చెను
గుంటయు ఉరియు నీకు తటస్థించెను
18తూములు పైకి తీయబడియున్నవి
భూమి పునాదులు కంపించుచున్నవి
19భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది
భూమి కేవలము తునకలై పోవుచున్నది
భూమి బహుగా దద్దరిల్లుచున్నది
20భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది
పాకవలె ఇటు అటు ఊగుచున్నది
దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది
పడి యికను లేవదు.
భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు
గుంటలో పడును
గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును.
21ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత
స్థల సమూహమును
భూమిమీదనున్న భూరాజులను దండించును
22చెరపట్టపడినవారు గోతిలో చేర్చబడునట్లుగావారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు
బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు.
23చంద్రుడు వెలవెలబోవును
సూర్యుని ముఖము మారును
సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ
మీదను యెరూషలేములోను రాజగును.
పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును.
Currently Selected:
యెషయా 24: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.