ఆగమనం: క్రీస్తు వస్తున్నాడు!నమూనా

Advent: Christ Is Coming!

91 యొక్క 1

ఆగమనం: అనగా ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఇది ఆశతో ఎదురుచూచెడి 4 వారముల వేడుక సమయము. మన రక్షకుడిగా, ప్రవచనపు మెస్సీయను వీక్షించుటకు మన హృదయాలను సిద్దము చేసికొనెడి సమయము ఇది. ఇది కన్యక గర్భమున పుట్టిన యేసు యొక్క జననము, జీవితము, మరణము మరియు పునరుజ్జీవం గురించి మన యొక్క పిల్లలకు బోధించుటకు మరియు తలపోయు సమయము. ఈ కాలమంతయూ మన హృదయాలను పూర్తి చేయబడిన కార్యమునకు దగ్గరగా తీసుకువెల్లేలా తలపోసేలా మరియు నూతన సంవత్సరంలోకి దూసుకు వెళ్ళటానికి కావలసిన నిరీక్షణ శక్తిని మరి అతని తదుపరి అద్భుతమైన రాకడ కోసం సంసిద్ధతను పొందాలని గడపూదాము!

కొవ్వత్తిని వెలిగించండి

మెస్సయ్యా కొరకు మనమంతా నిరీక్షిస్తున్నాం!
మీ కుటుంబ సభ్యులతో ఆగమనమును గురించి వివరించండి మరియు ప్రతి రోజుకు మీ ప్రణాళికలను తయారు చేసుకోండి. ఒక పొడవైన కొవ్వొత్తిపై 25 గంట్లు లేదా గుర్తులను సిద్దము చేయండి మరియు ప్రతి గుర్తు పక్కన సంఖ్యలు 1-25 (శాశ్వత సిరాతో) వ్రాయండి. ప్రతిరోజు సాయంత్రం మీరు దేవుని వాక్యమును ఏకాంతముగా లేదా కుటుంబముతో తెరిచి ఈ కొవ్వొత్తిని వెలిగించండి, ప్రతి రాత్రి ఒక గుర్తు లేదా గాటు వరకు కొవ్వత్తిని మండనివ్వండి.


లేఖనమును చదువుడి
మానవుడు మరియు ఆయన యొక్క సృష్టితో దేవుని నిబంధన
ఆదికాండము 1: 27-28, 2: 16-17 మరియు యిర్మీయా 33: 19-22

స్తుతిస్తూ స్పందించండి

మీ జీవితంతో స్తుతించండి
దేవుడు ఎల్లప్పుడూ అతని వాగ్దాన నిబంధనను నిలుపుకున్నాడు. ఆయన వాక్యం ఖచ్చితంగా ఉంది. మీరు ఆయనను విశ్వసిస్తారా?
మీ మాటలపై శ్రద్ధ చూపించండి. మీరు మీ వాగ్దానాలను నిలుపుకున్నారా?
మీరు తలపోసిన విధంగానే చెపుతున్నారా మరియు మీరు ఏమి చెపుతున్నది మీరు అనుకున్నదేనా?

ప్రార్థన తో స్తుతించండి
దేవుని వాక్యము ఉపయీగిస్తూ ప్రేమించండి, ఒప్పుకొని, మహిమ పరుస్తూ మరియు దేవుని ధన్యవాదాలు తెలియ చేయండి.

పాటలతో స్తుతించండి
పాడండి, "పుట్టనేసుడు నేడు మనకు"
రోజు 2

ఈ ప్రణాళిక గురించి

Advent: Christ Is Coming!

కుటుంబాలకు లేదా వ్యక్తులకు మెస్సయ్యాను బట్టి ఉత్సవము చేయుటకు మన హృదయాలను సిద్ధం చేయుటకు Thistlebend పరిచర్య నుండి దేవుని ఆగమనము యొక్క వాక్య ధ్యానమును సిద్ధము చేయబడినది. ఈరోజు మన జీవితాలపై క్రీస్తు ఆగమనము యొక్క ప్రభావము కోసం ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. డిసెంబర్ 1 న ప్రారంభించటానికి రూపొందించబడింది. ప్రతి ఒక్కరికీ మన తండ్రి యొక్క స్థిరమైన, నిబంధన ప్రేమను చూడడానికి ఈ ఉపదేశమును ఉపయోగించినప్పుడు మీ కుటుంబం శాశ్వతమైన జ్ఞాపకాలను చేసికొనవచ్చు.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Thistlebend Ministries వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.thistlebendministries.org దర్శించండి