నిబద్ధతనమూనా
సంబంధాల పట్ల నిబద్ధత
దేవుని ప్రేమను ప్రతిబింబించడం
మన సంబంధాలలో అచంచలమైన అంకితభావం కలిగి ఉండడం జీవితంలో అత్యంత
ముఖ్యమైన నిబద్ధతలలో ఒకటి. అది పవిత్రబంధమైన వివాహం కావచ్చు, ప్రశస్తమైన
కుటుంబ బాంధవ్యం కావచ్చు, ఆప్తమిత్రుల మధ్య ఇష్టంతో కూడిన స్నేహబంధం
కావచ్చు, లేదా క్రీస్తు శరీరంతో విడదీయరాని సంబంధం కావచ్చు. ఈ సంబంధాలను
పెంచి పోషించు కొనడంలోను కాపాడుకొనడంలోను దృఢమైన నిబద్దత దేవుని
అనంతమైన ప్రేమను మరియు అచంచలమైన విశ్వాస్యతను ప్రతిబింబిస్తుంది.
క్రీస్తుకు తన సంఘంపట్ల ఉన్న త్యాగపూరితమైన ప్రేమకు ప్రతిబింబమైన నిస్స్వార్థప్రేమతో
వివాహబంధాన్ని విలువైనదిగా భావిస్తూ ప్రాధాన్యత నివ్వడం, జీవితభాగస్వామిపట్ల
గౌరవ మర్యాదలను చూపించడంలోని ప్రాముఖ్యతను లేఖనాలు మనకు
గుర్తుచేస్తున్నాయి.
ఇంకా, మన కుటుంబాలను అచంచలమైన శ్రద్ధతో పోషించుకొనడం మరియు సంరక్షించు
కొనడంలోని గురుతర బాధ్యత గురించి 1 తిమోతి 5:8 వచనం నొక్కి చెబ్తుంది.
అచంచలమైన విధేయత కలిగి ఉండడంలోని బరువైన బాధ్యత గురించి, తోడుగా ఉండే
స్నేహితుల గురించి, సహానుభూతి మరియు కారుణ్యంతో ఒకరికొకరు పరస్సర భారాన్ని
మోయడంగురించి, ప్రోత్సాహంతోను క్షేమాభివృద్ధితోను ఒకరికొకరు నిర్మాణాత్మకంగా
ఉండడం గురించి బైబిల్ నొక్కి చెబ్తుంది.
సామెతలు గ్రంథం ఎడతెగని స్నేహంయొక్క ప్రాముఖ్యతను ఎత్తి చెబ్తూ సదాకాలం
ప్రేమించే స్నేహితుడి గురించి, శత్రుత్వంకొరకు పుట్టిన సహోదరుడి గురించి
తెలియజేస్తుంది.
మనం ఒకరిపట్ల ఒకరు ప్రేమకలిగి ఉండడంలో భక్తిపూర్వకమైన శ్రద్ధను
చూపించడంకొరకు, మన కంటె ఇతరులను యోగ్యులుగా గౌరవించడంకొరకు పిల్వబడ్డాం.
మనం ఒకరి భారాలను ఒకరు మోసినప్పుడు మనం క్రీస్తు నియమాన్ని నెరవేర్చినవాళ్ల
మవుతాం.
క్రీస్తును వెంబడించేవారుగా మనం యేసు క్రీస్తుయొక్క సాటిలేని ప్రేమను ప్రతిబింబిస్తూ
యథార్థత మరియు స్వచ్ఛత గల సంబంధాలను పెంపొందించుకొనడంకొరకు పిల్వబడ్డాం.
తాను మరియు తన తండ్రి ఏకమై ఉన్న రీతిగా ప్రేమలోని ఐక్యత ద్వారా లోకం
క్రీస్తుయొక్క సందేశాన్ని నమ్ముతుందనే భావార్థంలో యేసు తనను వెంబడించేవారి
ఐక్యతకొరకు ప్రార్థించాడు (యోహాను 17:20-21).
మనం క్రీస్తులో ఐక్యత కలిగి ఉన్నట్లయితే, లోకం క్రీస్తుకొరకు జయించబడగలదు.
మన సంబంధాల నడుమ ప్రేమపట్ల మరియు ఐక్యతపట్ల మనలోని నిబద్దత యేసు
యొక్క అపారమైన ప్రేమకు విస్మరించలేని సాక్ష్యం. ఇది ఇతరులు ఆయన ప్రేమను
అనుభవించే లాగా వారిని ఆకర్షిస్తుంది, మనం ఆయన కృపను పొందేలాగా చేస్తుంది.
ఈ వచనాన్ని బిగ్గరగా చదువుతూ ముగించుదాం,
20-21 “మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు
నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని
వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యమువలన నాయందు విశ్వాస
ముంచువారందరును ఏకమైయుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.”
ప్రేమను ధరించండి, ఐక్యత కలిగి ఉండండి, అప్పుడు లోకం తెలుసుకొనగలిగినది…
ఈ ప్రణాళిక గురించి
నిఘంటువు నిర్వచనం ప్రకారం నిబద్ధత అంటే, “ఏదైనా కారణంకొరకు, కార్యంకొరకు, లేదా సంబంధంకొరకు అంకితంచేసుకున్న స్థితి లేదా అంకితభావం.” క్రీస్తును వెంబడించే వారుగా మనం నిబద్ధత గల జీవితాలను జీవించడంకొరకు పిల్వబడ్డాం. దేవునితో మన నడకలో నిబద్ధత కలిగి ఉండడం ఒక బలమైన శక్తి, ఇది మనకు పట్టుదలను సహనాన్ని ఇచ్చి మనల్ని వర్ధిల్లజేస్తుంది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zeroకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/