ఆదేశంనమూనా

ఆదేశం

3 యొక్క 3

వెళ్లడానికి ఆదేశించబడ్డాం… అయితే నేను ఎక్కడ ప్రారంభించాలి?

క్రీస్తుతో మన నడక ఇంకా ఇంకా ముందుకు కొనసాగుతుండగా, మనలో ఉన్న ఆయన

ప్రేమవెల్లువ ఇతరులను సమీపించడానికి మనల్ని ముందుకు త్రోస్తుంది.

మనం సువార్తకు సాక్షులుగా ఉండడానికి, దేవుని దయాళుత్వాన్ని ప్రకటించడానికి,

యేసులో కనుగొన్న జీవితపరివర్తన శక్తికి సాక్ష్యం చెప్పడానికి ప్రధాన ఆదేశం మనకు

సంజ్ఞాజ్యోతిగా ఉంది. దయ గల ప్రతి పని, ప్రేమతో మాట్లాడిన ప్రతి మాట రక్షణ గురించి

గంభీరమైన సత్యాన్ని పంచుకొనడంలో మన ఆదేశాంలో భాగమవుతాయి.

ప్రధాన ఆదేశాన్ని కార్యసాధకంగా నెరవేర్చడానికి, ముందుగా మనం దేవుడు మనకొరకు

చేసిన అద్భుతాన్ని అంగీకరించాలి. సువార్త అంటే కేవలం శుభసందేశం మాత్రమే కాదు,

ప్రపంచానికి తెలిసిన గొప్ప సందేశం ఇది ఒకటే! క్రీస్తు అనుచరులుగా మనం కార్యసాధకంగా

ఆనందాన్ని పంచుకొనే ముందు, మనలో మనం వ్యక్తిగతంగా ఆ ఆనందాన్ని అనుభవించ

వలసి ఉన్నాం. మనం ఆయన సత్యం మరియు కృప అనే వెలుగులో నడుస్తుండగా,

ఇతరులు అంధకారంనుండి స్వేచ్ఛపొందడానికి మనం వారికి సహాయపడేవాళ్లమవుతాం.

ముందుగా మరియు ప్రధానంగా, మనం మనల్ని ప్రేమించుకున్నట్టే మన పొరుగువారిని

ప్రేమించడానికి పిల్వబడ్డాం. ఈ మూలాధారమైన నియమం, సులువైన భావనగా కనబడు

తున్నప్పటికి, జీవించడంలో సవాలుగా ఉండగలదు. ఏదేమైనప్పటికి, మన జీవితాలలో

దేవుడిని కలిగి ఉండడంలో ఉన్న విలువను మరియు అది కలిగించే పరివర్తనయొక్క

విలువను మనం నిజంగా బోధపరచుకున్నప్పుడు ఈ బహుమానాన్ని ఇతరులతో పంచు

కొనడం ఒక సహజకోరిక కాగలదు.

ప్రధాన ఆదేశాన్ని నెరవేర్చడంలో మరొక ప్రాణాధారమైన అంశం ప్రార్థన. మనం ఇతరులతో

పంచుకొనేటప్పుడు, మనం విత్తనాలు విత్తుతాం, వాటిని నీళ్లు పోస్తాం, అయితే అంతిమంగా

దేవుడు ఎదుగుదలను పరివర్తనను కలిగిస్తాడు. సువార్తను పంచుకొనే మన ప్రయత్నాలలో

మనం కలుసుకొనబోయేవారి జీవితాలలోకి ప్రవేశించడానికి దేవుని నడిపింపును కోరుకొనడం

కొరకు మనం అవశ్యంగా ప్రార్థనాశక్తిమీద ఆధారపడాలి.

మన చుట్టూ ఉన్నవారిని మనం ప్రభావితం చేసేటప్పుడు క్రీస్తు ప్రేమను ప్రతిబింబించడంలో

మనకెదురయ్యే ప్రతి అవకాశంలోను మన మాటలను చర్యలను స్వయంగా ప్రేమ

నడిపించాలి గాక.

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

ఆదేశం

“ఆదేశం” బైబిల్‌ ప్రణాళికకు స్వాగతం, ఇది క్రీస్తుయొక్క శిష్యులు వెళ్లి ఆయన ప్రేమను అందరికి తెలియజేయాలని ప్రతి శిష్యుడికి ఇవ్వబడిన దైవికమైన ధర్మవిధి యొక్క అన్వేషణ. ప్రధాన ఆదేశాన్ని దేవునినుండి వచ్చిన వ్యక్తిగత పిలుపుగా మరియు సమష్టి పిలుపుగా అంగీకరించడంలోని గంభీరమైన ప్రాముఖ్యత గురించి ఈ మూడు రోజుల ప్రయాణం లోతుగా తెలియజేస్తుంది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zeroకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/