మహిమను తిరిగి స్వాధీనము చేసుకొనుటనమూనా
అతీతమైనదానిలో మహిమ
మరియకు ఒక దేవదూత ద్వారా యేసు యొక్క పుట్టుక ప్రకటన నుండి తూర్పు నుండి వచ్చిన ముగ్గురు జ్ఞానుల సందర్శన వరకు మొత్తం క్రిస్టమస్ కథ అంతా అతీతమైనదిగా వ్రాయబడింది. దాని గురించి ఆలోచించండి,రాబోయే ప్రమాదాల గురించి కొత్త తండ్రిని హెచ్చరించడానికి దేవదూతలు కలలలో కనిపిస్తారు,ముగ్గురు మనుష్యులు గుర్తించి అనుసరించిన ఒక ఖగోళ శాస్త్ర సంబంధమైన సంకేతం,కొండపైన ఉన్న సాధారణ గొర్రెల కాపరికి దేవదూతలు కనిపించిమరియువారందరిని రక్షించే బిడ్డ పుట్టుకను ప్రకటించారు.
అసాధారణమైన మరియు ఈ లోకానికి వెలుపల తక్కువ ఏమీయు లేదు. వీరు తమ సాధారణ వాస్తవికత పరిధికి వెలుపల ఏదో ఒకదాని మీద అవగాహన కల్పించే సాధారణ మనుష్యులు. ఈ అవగాహన వారి జీవితాలను శాశ్వతంగా మార్చింది,ఎందుకంటే విధేయత చూపడానికి వారి సుముఖత. యోసేపు దేవదూతకు విధేయత చూపి మరియను తన భార్యగా చేసుకున్నాడు. గొర్రెల కాపరులు దేవదూతలకు లోబడి,క్రొత్తగా జన్మించినరక్షకుని ఆరాధించడానికి వచ్చారు. ముగ్గురు రాజులు రాజుల రాజును ఆరాధించడానికి లోకం చుట్టు సగం ప్రయాణం చేసారు.
మనం జీవించే కాలంలో,మనం కొన్నిసార్లు సహజత్వంలో చిక్కుకుపోతాము మరియు అతీతమైన స్థితిలో జీవించడం మరచిపోతాము. అతీతమైన శక్తులలో నివసించే మనుష్యులు భూమి మరియు దాని అవసరాలు గురించి తెలియనివారు కాదు,అయితే భూమిని తాకే పరలోకము యొక్క సంగ్రహావలోకనాలను చూడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. దేవుడు కనుచూపు మేరలో పని చేస్తున్నాడని,సరైనసమయం వచ్చినప్పుడు ప్రత్యక్షమవుతాడని నమ్ముతారు. నిరీక్షణ నిరాశపరచదు అని వారు ఇప్పుడు నిస్సందేహంగా ఉన్నారు.
దేవుని యొక్క చిత్తము "పరలోకములో వలె భూమి మీద" జరగాలని వారు హృదయపూర్వకంగా ప్రార్థిస్తారు.
అతీతమైన స్థితిని అనుభవించాలంటే మనం సహజంగా దేవునికి విధేయత చూపడంలో స్థిరంగా ఉండాలి. ఆయన మాటలను చదవడం మరియు ఆయన స్వరాన్ని వినడం ఆయనతో సంబంధాన్ని పెంచుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఆయనకు విధేయత చూపడం ద్వారా ఆయన మహిమను మానవాతీతంగా చూడడానికి మనలను ప్రధాన అభ్యర్థులుగా చేస్తుంది.
ప్రకటన: దేవా నీవు నిత్యుడవు,అమర్త్యుడవుమరియు అజేయుడు. నా జీవితం యెడల నీ చిత్తం పరలోకములో నెరవేరినట్లుగా ఇక్కడ భూమి మీద జరుగుతుంది అని నాకు తెలుసు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
దేవుని మహిమ అనేది మనం విన్న విషయం, అయితే దాని పరిచయం కారణంగా ఆ పదాన్ని మనం తేలికగా తీసుకుంటాము. ఈ క్రిస్టమస్ మీ దృక్కోణములో కొంత భాగాన్ని గానీ లేదా అంతటిని గానీ మార్చడానికి మీరు అనుమతిస్తూ ఉండగా, దేవుని గురించి బాగా తెలిసిన ఇంకా పదునైన సత్యాన్ని మీరు తిరిగి ఆలోచిస్తారని మేము ఆశిస్తున్నాము.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/