BibleProject | ఆగమన ధ్యానములునమూనా
దేవునిని మరియు ఇతరులను ప్రేమించాలనే గొప్ప ఆజ్ఞను దేవుని ప్రజలు పదేపదే నిర్లక్ష్యం చేసిన చరిత్రను హీబ్రూ బైబిల్ నమోదు చేస్తుంది. మనం ఇంకా మెరుగ్గా ఉంటామని ఆశిస్తే ఎలా? గొప్ప ఆజ్ఞతో పాటుగా ఒక కొత్త ఆజ్ఞను జోడించడం ద్వారా యేసు మనకు సహాయం చేస్తాడు. అయన కొత్త ఆదేశం, అయన త్యాగపూరిత ప్రేమ ద్వారా తన అనుచరులు ఇతరులను ప్రేమించేలా ఎలా శక్తివంతం చేస్తుందో చూపిస్తుంది.
చదవండి:
యోహాను 13:34, మరియు మార్కు 12: 29-31 ని సమీక్షించండి
1 యోహాను 4: 9-11
పరిశీలించు:
మార్కు 12: 29-31తో యోహాను 13:34 పోల్చండి. ఈ రెండు ఆదేశాల మధ్య తేడా ఏమిటి? యేసు సొంత మాదిరి ఎలా గొప్ప ఆదేశాన్ని పునరుద్ధరిస్తుంది మరియు నెరవేరుస్తుంది?
1 యోహాను 4: 9-11 ని జాగ్రత్తగా సమీక్షించండి. ఏ పదాలు లేదా పదబంధాలు మీకు ప్రత్యేకంగా ఉన్నాయి? ఈ వాక్య భాగము ప్రకారం, యేసు ఎందుకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, ఇతరులపై మన ప్రేమను ఏది ప్రేరేపించాలి?
ఈ రోజు మీరు నేర్చుకున్న దానికి ప్రతిస్పందనగా ప్రార్థించడానికి కొంత సమయం కేటాయించండి.
ఈ ప్రణాళిక గురించి
యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము BibleProjectకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleproject.com