ఆందోళనను దాని విధానాలలోనే ఓడించడంనమూనా

ఆందోళనను దాని విధానాలలోనే ఓడించడం

4 యొక్క 1

దానిని పిలవండి

మీరు సులభంగా ఆందోళన చెందుతున్న వ్యక్తిగా ఉన్నారా? అసందర్భమైన సమయాలలో అనేక సార్లు మిమ్మల్ని కదలకుండా చేసే తీవ్ర భయాందోళనల దాడులు మీకు కలుగుతున్నాయా? మీరు ఒత్తిడికి గురవుతున్నారా, తరచుగా మీ నెమ్మదిని భయంకరంగా కోల్పోతున్నారా?

మీరు ఆందోళనతో బాధపడుతున్నారని అంగీకరించడం సరైనదే. ఈ సమస్యతో సంబంధం ఉన్న న్యూనత భావమే ఆ సమస్యలో సగ భాగం. మనం ఎదుర్కొంటున్న వాటిని దాచి పెట్టాలి అని మనం భావిస్తాము. అదృశ్యమైనది అయినప్పటికీ చాలా నిజమైన శత్రువుతో పోరాడుతున్నామని దేవునితోనూ, మనతోనూ, నమ్మదగిన స్నేహితులతోనూ మనం నిష్కపటంగా ఉన్నట్లయితే మనం స్వేచ్ఛను అనుభవిస్తాము. చీకటిలో నుండి వెలుపలికి వెలుగులోనికి మనం దానిని పిలిచినప్పుడు మనల్ని బందీగా ఉంచేదేదైనా దాని శక్తిని కోల్పోతుంది. మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో దానిని మనం వెలుగులో స్పష్టంగా చూడవచ్చు, మనం చూపిస్తున్న శ్రద్ధను సూచిస్తున్నట్లయితే దానిని ధృవీకరించవచ్చు. మన ఆందోళనలు మన జీవితంలో చాలా నిజమైనా, ఇబ్బందికరమైనా సంఘటనల మీద ఆధారపడి ఉండవచ్చు లేదా ఊహించనవి గానీ లేదా అహేతుక భయాల మీద గానీ అవి ఆధారపడి ఉంటాయి. మనం వాటితో పోరాడుతున్నామని అంగీకరించిన తర్వాత, ఈ ఆందోళనను ప్రేరేపించే విషయాలను మనం దగ్గరగా చూడవచ్చు, దేవుడు మనలను గురించి శ్రద్ధ వహిస్తాడు, ప్రతీ ఆందోళననూ ఆయన మీద వెయ్యాలని మనలను అడిగే మన దేవుని ముందు మన సమస్య అంతటినీ ఉంచగలం. ఆయన తనమీద వేయమని అడుగుతాడు. దీనిని అంగీకరించడం, పరిష్కరించడానికి చూడడం అనేవి తరచుగా ఆందోళనతో ఉండే సిగ్గునూ, అపరాధభావాన్నీ తగ్గిస్తుంది, అదే సమయంలో మన సృష్టికర్త, మనలను బాగుగా యెరిగిన వాని నుండి సహాయం పొందటానికి కూడా వీలు కల్పిస్తుంది. మనం ఎదుర్కొంటున్న భావోద్వేగాల గందరగోళంలోనికి దేవుణ్ణి తీసుకురావడం ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన నిరంతర సంభాషణ ద్వారా మన పరిస్థితికి మరింత స్పష్టతను అనుభవించడం ఆరంభిస్తాము. ఇది మీ ప్రశ్నలకు సమాధానాలుగా ఉండకపోవచ్చు అయితే అది ఆయన మౌన సన్నిధిగానూ, నిన్ను ఆవరిచే మృదువైన బలంగానూ ఉంటుంది. దేవునితో మీ సంబంధం మొదలవుతున్నప్పుడు, దేవుడు దేవుడిగా ఉండటానికినీ, నీవు నీవుగా ఉండడానికినీ నియంత్రణ కోసమైన అవసరాన్ని విడిచిపెట్టడం ముఖ్యం అని మీరు తెలుసుకొంటారు. దానిని దేవునికి అప్పగించడం అనేది జీవితంలో ఒక్కసారి కాదు, కాని ఇది క్రమమైన క్రమశిక్షణ, కొన్నిసార్లు దైనందిన కార్యం అవుతుంది కూడా. ఎటువంటి తీర్పు లేదా కఠినత లేని ప్రేమగల, మృదువైన పరలోకపు తండ్రిలాగే మిమ్మల్ని చూచేలా మీరు దేవుణ్ణి విశ్వసించవచ్చు. మీరు ఆయన కౌగిలిలో విశ్రమించేలా, మీ హృదయానికి చెందిన ప్రతీ భారం విషయంలో మీరు ఆయనను విశ్వసించేలా మీరు ఆయనకు సమీపం కావాలని ఆయన మీ విషయంలో కోరుతున్నాడు. మిమ్మల్ని చిక్కులో పెట్టే ఆందోళన నుండి విముక్తిని పొందాలనీ, అపరిమితమైన ఆనందం, శాంతి మరియు విశ్రాంతి జీవితాన్ని గడపాలనీ కూడా ఆయన మీ విషయంలో కోరుకుంటున్నాడు. మీ స్వస్థతలోనూ, విమోచనలోనూ దేవుడు అధికమైన పెట్టుబడి పెట్టాడు కాబట్టి మనం ఆయనను నిలువరించవద్దు. ఈ రోజు మరియు ప్రతిరోజూ క్రీస్తు మీకు ఇచ్చే ధైర్యంతో నిర్భయంగా మీ ఆందోళనను ఎదుర్కొని, ఆయన దానిని నిర్వహించేలా వినయంగా ఆయనకు అప్పగిస్తారా?

ప్రార్థన:

ప్రియమైన ప్రభువా,

నేను _____________ విషయంలో ఆందోళనతో పోరాడుతున్నానని అంగీకరిస్తున్నాను. నీవు నాకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. నా భయాలను నీకు అప్పగించడానికి బదులు నా భయాలను గట్టిగా పట్టుకొని ఉన్నందుకు నన్ను క్షమించండి. నీవు నాకు సమీపంగా ఉండాలి, నా ఆందోళనలను నీకు అప్పగిస్తున్నాను. ఈ భారాన్ని నా కోసం నీవు భరించాలని నేను అడుగుతున్నాను. సిలువమీద నీ కుమారుడు సంపూర్తి చేసిన కార్యం కోసం వందనాలు. అక్కడ నా ఆందోళనలన్నీ ఒక్కమారే మేకులతో వేలాడదీయబడ్డాయి, స్వేచ్ఛలో జీవించడానికీ, నీవు నాకు అనుగ్రహించిన జీవితాన్ని ఆస్వాదించడానికి నాకు సహాయం చెయ్యండి.

యేసు నామంలో

ఆమేన్.

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

ఆందోళనను దాని విధానాలలోనే ఓడించడం

ఆందోళన అన్ని విధాలుగా మనలను బలహీనపరుస్తుంది, ఎందుకంటే ఇది మన సమతుల్యతను చెదరగొడుతుంది, భయంలో మనలను బంధిస్తుంది. ఇది కథకు ముగింపు కాదు, ఎందుకంటే పోరాటాన్ని అధిగమించడానికి మనం యేసులో స్వేచ్ఛనూ, కృపనూ కలిగియున్నాము. మనం దానిని కేవలం అధిగమించడం మాత్రమే కాదు, కాదు కాని దాని విషయంలో శ్రేష్ఠమైన వారంగా చెయ్యబడతాము, దేవుని వాక్యం కోసం, నిరంతరం మనలను ధైర్యపరచే ఆయన సన్నిధి కోసం కృతజ్ఞతలు తెలుపుతున్నాము.

More

ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.wearezion.co/bible-plan