మనస్సు ఒక యుద్ధ భూమి – ధ్యాన మాలిక నమూనా
అనుకూల నమ్మకం
నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానిని బట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. - రోమీయులకు 4:18–21
అబ్రాహాము కథ నేను ఎన్నిసార్లు చదివినా నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఇది వంద సంవత్సరాల వయస్సులో కొడుకు పుట్టడం మాత్రమే కాదు. ఇది ఒక అద్భుతం. వాగ్దానం నెరవేర్చడానికి అతను ఇరవై ఐదు సంవత్సరాలు వేచియుండుటను గురించిన విషయం అంతే అద్భుతమైనది. దేవుడు తనకు ఒక కొడుకు వాగ్దానం చేసినప్పుడు అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు.
మనలో ఎంతమంది దేవుణ్ణి నమ్ముతారని మరియు ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షణతో జీవిస్తారని నేను ఎంతో ఆశ్చర్య పోతున్నాను. మనలో చాలామంది "నేను నిజంగా దేవుని నుండి వినలేదు" అని చెప్పేవారు. "ఓహ్, దేవుడు నిజంగా అలా అనలేదని నేను ఊహిస్తున్నాను." లేదా, "ప్రభువు నుండి క్రొత్త మాట పొందడానికి నేను వేరే చోటికి వెళ్ళాలి."
శారా మరియు అబ్రాహాములు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. వారు కోరుకున్నదాన్ని పొందడానికి ప్రయత్నించే సాధనంగా, వారికి శారా యొక్క పనిమనిషి, హాగరు ఉన్నందున, అతనికి ఒక కొడుకు పుట్టాడు, కాని అది దేవుని ఉద్దేశ్యము కాదని దేవుడు అతనికి తెలియజేసాడు. వారి ప్రయత్నాలు దేవుని వాగ్దాన ప్రకారముగా పొందుకునే సంతానము యొక్క రాకను ఆలస్యం చేశాయని నేను నమ్ముతున్నాను.
మన అసహనంలో, మనము తరచుగా విషయాలను మన చేతుల్లోకి తీసుకుంటాము. మనము “ప్రకాశవంతమైన ఆలోచనలు” పొందుకుంటామని - మనము ఆశించే స్వంత ప్రణాళికలు, దేవుడు ఆశీర్వదిస్తాడని మనము ఆశిస్తాము. ఈ ప్రణాళికలు గందరగోళం మరియు కలవరానికి ద్వారములు తెరుస్తాయి. అప్పుడు వాటి ఫలితాలను పరిష్కరించాలి, ఇది తరచూ మన అద్భుతాన్ని ఆలస్యం చేస్తుంది.
దేవుని నుండి పది ఆజ్ఞలను స్వీకరించిన తరువాత మోషే సీనాయి నుండి దిగినప్పుడు, వేచి ఉండటంలో అసహనానికి గురైన ఇశ్రాయేలీయుల దుష్టత్వాన్ని చూశాడు. కోపంతో, దేవుడు ఆజ్ఞలను వ్రాసిన పలకలను పగుల గొట్టాడు. మోషే కోపాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పటికీ, అది దేవుని చేత ప్రారంభించబడలేదని మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల, మోషే మళ్ళీ సీనాయి పర్వతాన్ని అధిరోహించవలసి వచ్చింది మరియు మరోసారి పది ఆజ్ఞలను పొందే ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి వచ్చింది. మోషే క్షణికమైన భావోద్వేగాన్ని కలిగి ఉండవచ్చు, కానీ అది అతనికి చాలా అదనపు పనిభారమైయున్నది. ఇది మనందరికీ మంచి పాఠం. మనము మొదట ప్రార్థన చేయాలి మరియు దేవుని ప్రణాళికతో ఏకీభవించాలి, మొదట ప్రణాళిక చేసుకొని తరువాత దానిని సఫలం చేయుమని ప్రార్థించండం కాదు.
దేవుణ్ణి విశ్వసించడం మరియు సంవత్సరములు జరుగుతుండగా దానిలో నిలబడటం చాలా కష్టం.
కొన్నిసార్లు నా సమావేశాల తరువాత, ప్రజలు నా వద్దకు వచ్చి నాకు చాలా విచారకరమైన కథలు చెబుతారు. నేను వారిని సానుకూలంగా మరియు ఉత్సాహంగా ఉండటానికి ప్రోత్సహిస్తున్నాను. కొంతమంది నేను చెప్పే ప్రతి మాటను వింటారు తలూపుతారు, బహుశా చిరునవ్వు కూడా చిందిస్తారు, ఆపై వారు అన్నింటికన్నా చాలా ప్రతికూలమైన మాటను చెబుతారు: “కానీ... "ఆ ఒక్క పదంతో, నేను చెప్పిన ప్రతిదాన్ని వారు నిరాకరిస్తున్నారు అని అర్ధమవుతుంది. అది అబ్రాహాము ఆత్మ కాదు.
బైబిల్ మనకు వాగ్దానాలు, నిరీక్షణ మరియు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవుడు తనకు సేవచేసేవారికి మంచి వాగ్దానం చేస్తాడు. మన పరిస్థితుల యొక్క ప్రతికూలత ఉన్నప్పటికీ-మరియు కొంతమందికి ఖచ్చితంగా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ - దేవుడు ఇంకా మంచి వాగ్దానం చేస్తాడు. మన మంచితనం యొక్క భావం దేవుని మాదిరిగానే ఉండకపోవచ్చు. మనకు కావలసినదాన్ని వెంటనే పొందడం మనకు ఉత్తమమైనది కాకపోవచ్చు. కొన్నిసార్లు వేచి ఉండటం గొప్పది ఎందుకంటే అది మనలో దేవుని గుణ లక్షనమును అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.
ప్రభువు మనకు మంచి చేయటానికి మరియు మనల్ని సంతోషపెట్టడానికి ఎంచుకుంటాడు; సాతానుడు తప్పు చేయటానికి మరియు మనల్ని నీచంగా చేయడానికి ఎంచుకుంటాడు. మేము ఓపికగా ఉండి, దేవుని వాగ్దానాలను నమ్ముతూనే ఉండవచ్చు, లేదా దుష్టుడు గుసగుసలతో మన చెవులను నింపడానికి మరియు మమ్మల్ని దారితప్పించడానికి అనుమతించవచ్చు.
అద్భుతాలకు మూలం దేవుడు అనే వాస్తవాన్ని మనలో చాలా మంది విస్మరించారు. ఆయన అసాధ్యమును సాధ్యం చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు: ఆయన గోడ్రాలైన శారాకు ఒక కుమారుడిని ఇచ్చాడు; ఇశ్రాయేలీయులు ఆరిన నేలపై నడవడానికి అతను ఎర్ర సముద్రము పాయలుగా చేసాడు; అతను గోల్యతును ఒడిసెలలోని ఒకే రాయితో నాశనం చేశాడు. అవి అద్భుతాలు. ప్రకృతి నియమాలను ధిక్కరించి పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు (ఆయన చట్టాలను రూపొందించాడు, కాబట్టి ఆయన వాటిని విచ్ఛిన్నం చేయగలడు).
హెబ్రీయులు 11 విశ్వాసం గురించి మరియు వాగ్దానాలను నమ్మడానికి ధైర్యం చేసిన దేవుని ప్రజల గురించి వ్రాయబడిన అధ్యాయం. "విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” (వ. 6).
ఇది సాతానుడు చెప్పే అబద్ధం మరియు చాలా మంది సులభంగా అంగీకరించేది. దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తాడు, మరియు ఆయన మన తండ్రి అని బైబిల్ చెబుతుంది. ఏదైనా మంచి తండ్రి తన పిల్లలకు మంచి పనులు చేయడానికి ఇష్టపడతారు. దేవుడు మీ కోసం మరియు నా కోసం మంచి పనులు చేయాలనుకుంటున్నాడు.
మీ జీవితంలో ఒక అద్భుతాన్ని ఆశించండి. చాలా అద్భుతాలను ఆశించండి.
దేవుని వాగ్దానాలపై సానుకూల నమ్మకం మంచి ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే మంచివాడు వాటిని మనకు పంపుతాడు. వదులుకోవడానికి నిరాకరించండి మరియు మీ సానుకూల నమ్మకం యొక్క ఫలితాన్ని మీరు చూస్తారు.
మా ప్రియ పరలోకపు తండ్రీ, నా విశ్వాస లేమిని బట్టి నన్ను క్షమించండి. నన్ను మోసగించడానికి సాతాను అనుమతించినందుకు నన్ను క్షమించండి లేదా నేను మీ అద్భుతాలకు పనికిరానివాడిని లేదా అనర్హుడిని అని అనుకుంటాను. మీరు నన్ను అర్హులుగా చేసినందున నేను అర్హుడిని. మీరు అసాధ్యమైన దేవుడు, మరియు మీ సన్నిధిలో వేచి ఉండటానికి నాకు సహాయం చేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను మరియు ఎప్పటికీ వదులుకోను. నా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఈ ధ్యాన మాలిక కోపం, గందరగోళం, ఖండించడం, భయం, సందేహం జయించడానికి నిరీక్షణ యొక్క ప్రేరణలతో మిమ్మల్ని సిద్ధం చేస్తుంది...మీరు దీనికి పేరు పెట్టండి. ఈ అంతర్దృష్టులు మిమ్మల్ని గందరగోళపరిచే మరియు అబద్ధం చెప్పే శత్రువు యొక్క పధకములు వెలికి తీసేందుకు, విధ్వంసక ఆలోచన విధానాలను ఎదుర్కోవడానికి, మీ ఆలోచనను మార్చడంలో విజయాన్ని కనుగొనడానికి, బలాన్ని, ప్రోత్సాహాన్ని పొందడానికి మరియు, ముఖ్యంగా, మీ మనస్సులోని ప్రతి యుద్ధంలో విజయం సాధించడానికి మీకు సహాయపడతాయి. ఇది ఒక రోజు ఒక సమయంలో అయినా...
More
ఈ ప్రణాళికను అందిస్తున్నందుకు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ కు కృతఙ్ఞతలు. మరిన్ని వివరముల కొరకు దయచేసి దర్శించండి: tv.joycemeyer.org/telugu