కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం నమూనా

కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం

7 యొక్క 1

పొంగిపొరలే ప్రవాహంలో నివసిస్తున్నారు  

మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మీరు నిర్వహించలేనివిగా ఉన్నట్టు నిష్ఫలంగా మీరెప్పుడైనా భావించారా?  

పరాజయం తరువాత పరాజయం ఎప్పుడైనా మీరు అనుభవించారా? దాని నుండి మేలైనది ఏమైనా వస్తుందని ఎదురుచూసారా? కఠినమైన సమయాలలో నూతన దృక్పథాన్నీ, విశ్వాసాన్నీ తీసుకురావాలని, శ్రమలకు మరొక వైపు ఉన్న ఆశీర్వాదాల కోసం మనలను సిద్ధపరచడం కోసం ఈ బైబిలు ప్రణాళిక ఎదురుచూస్తుంది. పరిస్థితులు ఏమైనప్పటికీ మనం దేవుని సన్నిధితో నిండియున్నప్పుడూ, ఇతరులకు దేవుని ఆశీర్వాదాల కోసం ఒక సాధనంగా దేవుడు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడూ పొంగిపొరలే అనుభవం కలుగుతుంది. 

ఒక పెద్ద నీటి ఊటనూ, దానినుండి వచ్చే జలాలు క్రింద ఉన్న మానవ నిర్మిత కొలనును నింపుతున్నట్టు ఉండే చిత్రపటాన్ని గీయండి. అనేక పురాతన ఊటలకు సంబంధించిన నీటి మూలాలు ఆ ఊటలకంటే హెచ్చయిన స్థాయిలో ఉండి ప్రవహిస్తాయని చెప్పబడ్డాయి. నీటి మూలానికీ నీటి ఊటకూ మధ్య ఎత్తులో ఉన్న వ్యత్యాసం అధికంగా ఉన్నప్పుడు, నీరు అంత అధికంగా పైకి ప్రవహిస్తుంది. అదేవిధంగా మన జీవితాలలో, స్థిరమైన స్థితిలో పొంగి పొరలి ప్రవహించాలంటే మనకంటే ఉన్నతంగా ఉన్న మూలానికి మనం సంబంధపరచబడాలి. మనకు ఆ మూలం ప్రభువైన క్రీస్తే!

కీర్తన 65:11 వచనం ఈ విధంగా చెపుతుంది, “సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని యున్నవి.” 

మన జీవితాల కోసం ఇది యెంత అద్భుతమైన వాగ్దానం!- మన పరలోకపు తండ్రి మన సంవత్సరాన్ని గొప్ప పంటతో కిరీటంగా ధరింప చేస్తాడు, బీడుబారిన, ఎండిన కఠినమైన కాలాల్లో సహితం ఆయన మనలను సమృద్ధితో పొంగిపొరలేలా చేస్తాడు. “సమృద్ధితో పొంగిపొర్లడం” అనేది దేవుని గుణ లక్షణం అనేది వాస్తవం. ఆయన ఎవరు అనే దానిని గురించి ఎటువంటి సందేహాలు లేవు. అంటే క్రైస్తవులుగా, మన హృదయాలలోనూ, జీవితాలలోనూ క్రీస్తుతో మనం కూడా ఈ లక్షణాన్ని ప్రదర్శించగల సామర్థ్యం కలిగి ఉన్నాము.  

పొంగిపొరలే స్థితి మన జీవితం దేవునితో నిండియున్న స్థితిని సూచిస్తుంది, ఇతరులు ఆ ధన్యస్థితిని అనుభవించడం ప్రారంభిస్తారు. వివరించలేని సమాధానం, ఆనందాలను మనం కలిగియుంటాము, ఇతరుల జీవితాలను మార్చేదిగా ఉంటుంది. పొంగిపొరలే అనుభవం అంతిమ గమ్యం వద్ద కనిపించదు, దానికి బదులుగా ఇది జీవిత ప్రయాణమంతటిలోనూ అనుభవంలో ఉంటుంది. సంపద పెరుగుదల లేదా ప్రభావం విస్తరించడం వంటి ఫలితాలను బట్టి దీనిని నిర్ణయించలేము అయితే ఇది మన జీవితంలో అనుదినం, ఉద్దేశపూర్వకంగా క్రీస్తును కలిగియుండడంలో ఉంటుంది.  మన జీవితంలో నిరీక్షణా, ఉద్దేశమూ పలచబడుతున్నప్పుడు గానీ లేదా తక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా కనిపించే తక్కువ ఆదర్శ పరిస్థితులలో ఉన్నప్పుడు సహితం, సమృద్ధిగా జీవించడానికి ఈ పొంగిపొరలే అనుభవం మనకు తగిన సామర్ధ్యాన్ని కలిగిస్తుంది.  మన హృదయాలలో ఉన్న ఈ సమృద్ధి, మనం కలుసుకున్నవారికి ప్రేమనూ, దయనూ ఇక్కడినుండే ప్రదర్శించగలిగేలా చేస్తుంది. 

క్రైస్తవ జీవితం నమ్మశక్యం కాని ఆశీర్వాదంతోనూ, తీవ్రమైన పోరాటంగానూ ఉంటుందని మీరు గమనించి ఉంటారు. మీరు అనేక ఆశీర్వాదాలను కలిగియున్నప్పటికీ, మీకు పోరాటాలు అధికంగా ఉన్నాయని మీరు గ్రహించారా? కొన్ని పరిస్థితుల నుండి మేలైనది ఏదీ దొరకని విధంగా మీ పరిస్థితులకు మీరు బాధితులుగా ఉన్నట్టుగానూ, ప్రతీదీ మీకు విరోధంగా ఉన్నట్టుగానూ మీకు అనిపిస్తుందా? మీ సన్నిహితుల నుండి మీరు ఎదురుదెబ్బలు అనుభవించి ఉండవచ్చు లేదా మీ స్వంత కుటుంబం కూడా మిమ్మల్ని నిరాశపరిచియుండవచ్చు, 

ఇటువంటి పరిస్థితుల మధ్య పొంగిపొరలే అనుభవంతో ముందు వెళ్ళగలరని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఆదికాండం గ్రంథంలో యోసేపు జీవితం మీకు మార్గదర్శకాన్నీ, నిరీక్షణనూ ఇస్తుంది.

అతని తోబుట్టువులు అతనిని తిరస్కరించారు, బానిసత్వంలోనికి అమ్మివేసారు. విడిచిపెట్టేసారు, దుర్వినియోగ పరచారు, తప్పుడు ఆరోపణలు చేశారు, అతనిని మరచిపోయారు. అటువంటి పరిస్థితులలోనుండి మీరు ఏవిధంగా బయటికి వస్తారు? సూర్యకాంతిని రూపుమాపాలని చూసే పెద్ద మేఘంలోని వెండి పొరను ఇంకా ఏవిధంగా చూడగలరు? యోసేపు తన పరిస్థితులలోనుండి దాటివెళ్ళడం, లేదా మేఘంలో వెండి పొరను చూడడం కంటే అధికంగా చేసాడు. దేవునితో కలిగియున్న పొంగిపొరలే జీవితం మాత్రమే అగాధంలో నిరీక్షణనూ, కష్టాలలో ధైర్యాన్నీ, శ్రమలో ఉద్దేశాన్నీ, నిరీక్షణలో శక్తినీ కనుగొనగలదు.

ఇటువంటి జీవితాన్ని గడపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పొంగిపొరలే అనుభవంలో జీవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం

పొంగిపొర్లుతున్న అనుభవంలో నుండి నడవాలనీ, పని చేయాలనీ, ప్రేమించాలనీ, సేవించాలనీ మీరు ఈ రోజు తీర్మానించుకొంటారా? ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు, బాగా నీరు కట్టిన తోటనూ లేదా ఏ కాలంలోనైనా ఎండిపోని పొంగిపొరలే ఒక ఊటను వారు చూచేలా మిమ్మల్ని నింపాలని పరిశుద్ధాత్మను అడుగుతారా?

More

ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in