యేసు మాత్రమేనమూనా
యేసు మాత్రమే- జీవితాన్ని నెరవేర్చువాడు
నెరవేర్పు అంటే ఆనందాన్నీ, సంతృప్తినీ లేదా సంపూర్తి అయిన భావననూ కనుగొనడం అని అర్థం. క్రీస్తు అనుచరులం అయిన మనకు ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మన జీవితాలు వేరు వేరు కార్యకలాపాలలో చిక్కుకొని పని కలిగి ఉండవచ్చు లేదా మనం తగినంత వేగవంతంగా ఉన్నట్టు కనిపించికుండా నెమ్మదిగా వెళ్తున్న దారిలో ఉండవచ్చు. క్రీస్తు అనుచరులంగా మన జీవితాలలో దేవుడు ఇచ్చిన ఉద్దేశ్యాన్ని మనం కనుగొన్నప్పుడు మన జీవితాలమీద అనంతంగా నెరవేర్పు జరుగుతుంది. యేసు లేకుండా మన జీవితాలు శూన్యంగా ఉంటాయి, ఎటువంటి ప్రభావాన్ని కలిగియుండవు, నెరవేర్పు లోపిస్తుంది.
నేటి వాక్య భాగాలలో, యేసు తనను తాను మూడు సాధారణ చిత్రాలతో పోల్చుకోడాన్ని మనం చూస్తున్నాము.
ఆయన యోహాను 6 వ అధ్యాయంలో ఇలా చెప్పాడు, ఆయన జీవాహారం అని చెప్పాడు, ఆయన వద్దకు వచ్చిన వారు ఎన్నడూ ఆకలి గొనరు లేదా దప్పిక గొనరు. రొట్టె సారూప్యతను ఉపయోగించడం ద్వారా ఆయనను మనకు “ముఖ్యమైనవానిగా”చేసుకోమని ఆయన అడుగుతున్నాడు. మన గృహాలకు రొట్టె ఎంత ముఖ్యమో అదేవిధంగా మన ఉనికికి కూడా యేసు చాలా పాముఖ్యమైనవాడు. ఆయనను మన ప్రభువుగానూ, రక్షకుడిగా అంగీకరించడంలో, మనకు నిత్యజీవ బహుమతి లభిస్తుంది. నిత్యత్వం మనకు నిశ్చయమైన గమ్యం అయినప్పుడు, మనం ఆనందంగానూ, ఉద్దేశపూరితంగానూ జీవించడంలో అనుదినం మనకు సహాయపడడానికి యేసు అవసరం. యేసుతో అనుదినం నడవడానికి మనం ఎంత ఉద్దేశపూర్వకంగా ఉన్నాము? ఆయనతో ఒంటరిగా మనం సమయం కేటాయించడానికి మనం తృష్ట కలిగియున్నామా, మనం కాలక్రమ పట్టికలో పార్థన, ఆరాధనలకు ప్రాధాన్యతలను ఇస్తున్నామా? ప్రభువైన యేసు నీకు ప్రధానమైనవాడుగా ఉన్నాడా లేదా మీకు ప్రత్యామ్నాయంగా ఉన్నాడా?
యోహాను సువార్త 10 వ అధ్యాయం 10 వ వచనంలో, దొంగ దొంగిలించడానికీ, చంపడానికీ, నాశనం చేయడానికి వచ్చినప్పటికీ, మనకు సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడని చెప్పాడు. యేసు ఇక్కడ గొర్రెలు రూపకాన్ని వినియోగిస్తున్నాడు. ఆయన తనను తాను గొర్రెలు పోవు ద్వారంగానూ, గొర్రెల కాపరిగానూ పోల్చుకొన్నాడు. మనం గొర్రెలం. గొర్రెలు ఉన్నతమైన సామాజిక జంతువులు. భద్రత, పోషణ, ఆహారం కోసం మందలో ఒకదానికొకటి అవసరమైన జంతువులు. సమృద్ధికి సాదృశ్యంగా ఉన్న పచ్చిక బయళ్ళ అనుభవం కలగడానికి మనకు క్రీస్తు కేంద్రిత సమాజంలో మనం అందరం ఉండాలని ప్రాథమికంగా యేసు చెపుతున్నాడు. బైబిల్లో సమృద్ధి పదం ఎక్కువగా దేవునినీ, ఆయన అపారమైన ప్రేమ, విశ్వాసం, దయను గురించీ సూచించడానికి వినియోగించబడింది. 2 కొరింథీయులు 9 అధ్యాయంలో చూసినట్లుగా దాతృత్వంతో ఈ సమృద్ధి పదం సంబంధించపరచబడింది. ఇక్కడ పౌలు సమృద్ధిగా కోయడానికి సమృద్ధిగా విత్తడం అవసరం అని దానిని గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవులంగా మనకు ఈ సమృద్ధి సమాజం నేపథ్యంలోనే అనుభవించబడుతుంది. ఇక్కడ మనం ఆశీర్వదించబడిన రీతిగానే ఇతరులనూ ఆశీర్వదిస్తాము. మనం అనుచితంగా పట్టుకొని ఉంటే – మనం ఈ ప్రవాహాన్ని అనుభవించలేము. ఇతరులను ఆశీర్వదించడంలో మనం లెక్కించేవారంగా ఉన్నట్లయితే మనకు సమృద్ధి ఉండదు. సమాజంగా ఉండడం మనం తప్పించినట్లయితే మన సమృద్ధిని పంచుకునే అవకాశం మనకు ఉండదు - అప్పుడు మనం స్వీయఅనుగ్రహం గలవారంగానూ, అంతర్గత లక్ష్యం గలవారంగానూ ఉంటాము.
యోహాను సువార్త 15 అధ్యాయం 4 వ వచనంలో, యేసు తనను తాను ఒక ద్రాక్షావల్లితోనూ, ఆయన తండ్రి ప్రధాన వ్యవసాయకునిగాను, మనలను ద్రాక్షా తీగెలుగానూ పోల్చాడు. మరింత ఫలప్రదంగా ఉండడానికి ఫలవంతమైన కొమ్మను ఏవిధంగా కత్తిరింఛి సరిచెయ్యబడడం గురించి 2 వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. అందువల్ల క్రైస్తవులంగా మన జీవితంలో ఫలప్రదంగా ఉండటానికి క్రమంగా కత్తిరింపు అనుభవం తప్పనిసరి అని ఇది సూచిస్తుంది. కత్తిరింపు చెయ్యడం మొక్కను గాయపరుస్తుంది, అయితే ఇది మొక్క ఆరోగ్యం, పెరుగుదలకు చాలా ప్రాముఖ్యమైనది. అదే విధంగా మన జీవితంలో దేవుడు కత్తిరింపుల ద్వారా మనలను తీసుకువెళతాడు, తద్వారా మనం క్రమంగా ఆయన పోలికగా మార్పు చెందుతాము, ఫలాలను ఫలిస్తాము. మన పట్ల దేవుని అపారమైన ప్రేమకు ఇది నిదర్శనం. మనల్ని మనలాగే విడిచిపెట్టేంతగా ఆయన మనలను అమితంగా ప్రేమిస్తున్నాడు. మన ఫలింపు మనకు అరుదుగా అనుభవంలోనికి వస్తుంది అనేది ఆసక్తికరమైన అంశం ఎందుకంటే సాధారణంగా కత్తిరింపు సంబంధిత వేదనలు లేదా ఎదురుదెబ్బలలో మనం ఉంటున్నాము, అయితే ఇది మన చుట్టుపక్కల ఉన్నవారి అనుభూతిలోనికి వస్తుంది. దయ, స్వీయ నియంత్రణ, ఓర్పు, సహనం, వంటి లక్షణాలు మనలో అభివృద్ధి కావడం, మనలో భిన్నమైనదాన్ని వారు గ్రహిస్తారు.
ప్రార్థన: ప్రియమైన ప్రభువా, నాకు ప్రేమగల తండ్రిగా ఉన్నందుకు వందనాలు. ప్రతీదినం నేను ప్రతిరోజూ నీతో నడవాలని ప్రార్థిస్తున్నాను. దాతృత్వంతో జీవించాలనీ, నీ స్వారూప్యంలోనికి నన్ను మార్పుచేస్తుండగా కలిగే మార్పుకు నేను ఇష్టపూర్వకంగా ఉన్నాను. యేసు నామంలో. ఆమేన్.
ఈ ప్రణాళిక గురించి
ఈ గందరగోళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోడానికి యెంచుకోండి, అనిశ్చిత సమయాల్లో భయం విషయంలో విశ్వాసం కలిగియుండడానికి యెంచుకోండి. మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు ప్రతీ దినం ఏమి జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులోనికి ధైర్యంగా అడుగు పెడతారని మేము నిరీక్షిస్తున్నాము.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in