విశ్రాంతి కొరకు సమయమును కేటాయించుటనమూనా
విశ్రాంతి తీసుకొనుట అంటే ఏమై యున్నది?
ప్రతి నెల గడుస్తున్నకొలది మనం చేయవలసిన పనుల బాధ్యతలు పెరిగిపోతూనే ఉన్నాయి. మన స్నేహితులతో కలిసి గడుపుటకు మనం ప్రయత్నం చేసినప్పుడల్లా, మనకి ఖాళీ దొరికే సాయంకాల సమయము ఇంకా నెలకు పైగా దూరంలో ఉందనే విషయం మనల్ని విస్మయం పొందేలా చేయును. మన పిల్లల కార్యక్రమములు, చర్చి కార్యక్రమాలు, వృత్తిపరమైన అంశములు, జన్మదిన వేడుకలు మరియు వేసవి సెలవుల యాత్రలు వంటివి ముందుగానే ఉన్నవి. మన జీవితమంటిని పూర్తిగా ప్లాన్ చేసికొని ఉండుట చేత మనలను ఉత్తేజపరచి మరియు మనకు విశ్రాంతినిచ్చే ఏ అంశమునకు చోటు లేకుండా పోయింది.
విశ్రాంతి తీసుకోవడం బద్ధకస్తులుగా చేస్తుంది అని తరచుగా మనం అనుకుంటూ ఉంటాము. విశ్రాంతి అంటే ఇంట్లో కూర్చొని ఒక్క పని కూడా చేయకుండా ఉండటమేనని మనం అనుకుంటాము. మన విశ్రాంతి వేళల్లో అది కేవలం ఒక భాగముగా మాత్రమే ఉండును కాని, అదే సమస్తం కాదు.
విశ్రాంతి అనగా బాగవ్వుట
విశ్రాంతి అంటే మనం పూర్తిగా అలసి సొమ్మసిల్లిన వేళలో కొంతసేపు బాగా ఊపిరి పీల్చుకోవాలని మనము తెలుసుకొనుట. మన అనుదిన జీవితాలలోని పనిపాట్లను ఎలా సమర్థవంతంగా చేయాలో మరియు మనయొక్క హద్దులను తెలుసుకొనుట. మన శరీరాలు చక్కగా బాగుగా ఉండాలంటే, సమృద్ధి అయిన విశ్రాంతిని మనం తప్పక పొందుకోవాలి, రాత్రి వేళ మంచి నిద్ర కూడా అందులో భాగమే. మనం బహు తరచుగా అలసిపోతున్నట్లు మనం గ్రహించినట్లయితే, ఎంతసేపు మనము రాత్రి నిద్రపోతున్నాము అన్నదే కాక ఎప్పుడు పండుకుంటున్నామో కూడా మనం పరిశీలించుకొనుట మంచిది.
విశ్రాంతి అనగా అలసట తీర్చుకొనుట
విశ్రాంతి అంటే ఏది మనలను బలపరుస్తుందో మరియు ఏది కాదో మనము తెలుసుకొనుట. మన ప్రాణములను తెప్పరిల్ల చేసే పనులను చేయుట లేక కొంచెంసేపు ఊరకనే ఉండుటకు మనం ఎన్నుకొనుట. మనల్ని బలహీనపరచే వాటినే మనము చేస్తూపొతే, మనలను బలపరచే వాటిని ఎప్పుడు తెలుసుకొనగలము, ఇలానే ఉంటే ఇంకేన్నటికి మనం అలసట తీర్చుకొనలేము. ఇలా మన పాత్రలో ఉన్నదానిని తోడుకుంటూ పోక మన విశ్రాంతి వేళల్లో దానిని నింపే పనిలో ఉండాలి.
విశ్రాంతి అనగా నూతనపరచ బడుట
విశ్రాంతి అంటే మన జీవితపు భాగములన్నిటిలో నూతనత్వమును అనుభవించుట. దేవునితో సమయమును గడుపుట ద్వారా మనము ఆత్మీయముగా నూతనపరచ బడుట. మనల్ని మానసికంగా ఉత్తేజపరచే విషయాలను చేయుటకు మనం ఇష్టపడినప్పటికీ, అనుదినము దేవునితో సమయము గడుపుట ద్వారా మనలోని ఆత్మ ఉత్తేజపరచ బడటం మనకి కావాలి.
రాబోయే నాలుగు రోజులలో, మన ప్రాణాత్మ దేహములకు విశ్రాంతినివ్వగల కొన్ని విషయాలను గూర్చి తెలుసుకుందాము. అనుదిన అలవాట్ల లాగా మారే కొన్ని పద్ధతులను ఎలా మన జీవితాలలో ఇమిడింప చేసుకోవాలో మనము తెలుసుకుందాము. అలా చేయుట ద్వారా, మన జీవితాలలో మానసికంగా, ఆత్మీయంగా మరియు శారీరకంగా మనలను బలహీనపరచే వాటినుండి వైదొలిగే మార్గము నందు మనము పయనించగలము.
ఆలోచించండి
- విశ్రాంతి తీసుకోవాలి అని మీకు అనిపించినప్పుడు, అది అసాధ్యమన్నట్లు మీకు అనిపించిందా?
- మీ జీవితములో దేనియందు మీకు ఎక్కువ విశ్రాంతి కావాలని అనిపించింది? మీ శరీరమునకా, మనస్సుకా లేక మీ ఆత్మకా?
- ఈనాటి బైబిల్ ధ్యానము లేక సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రత్యేక్షతను వ్రాసుకోండి
ఈ ప్రణాళిక గురించి
మితిమీరిన పనితనం మరియు ఎల్లప్పుడు బిజీగా ఉండే తత్వం లాంటివి మన సమాజంలో తరచుగా ప్రశంసలు పొందుకొనును, కావున విశ్రాంతి అనేది ఇప్పుడు ఒక సవాలుగా మారింది. మన యొక్క బాధ్యతలు మరియు ఉద్దేశ్యములను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే, విశ్రాంతి తీసుకోవటం మనం నేర్చుకోవాలి లేనిచో మనం ఏర్పరుచుకున్న లక్ష్యాలను చేరుకొనుటకు మరియు మనం ప్రేమించే వ్యక్తులకు మనవంతుగా ఇవ్వటానికి ఏమి మిగిలియుండదు. కాబట్టి ఈ విశ్రాంతిని గూర్చి నేర్చుకొనుటకు మరియు మనము నేర్చుకొనిన దానిని మన జీవితాలలో ఎలా అవలంబించాలో రాబోయే ఐదు రోజులలో తెలుసుకుందాము.
More