యవనస్తులు
ఆందోళన
మన జీవితాలు ఏదో తెలియని ఆందోళన మరియు భయముతో చాలా సులభంగా ఉక్కిరి బిక్కిరి అవ్వగలవు. దేవుడు మనకు ధైర్యము కలిగిన ఆత్మను యిచ్చాడు కానీ భయము మరియు ఆందోళన గల ఆత్మను యివ్వలేదు. ఈ ఏడు రోజుల పాఠ్య ప్రణాళిక ఎలాంటి పరిస్థితులలోనైనా మీరు దేవుడి వైపు తిరిగేలా చేస్తుంది. దేవుడి మీద నమ్మకం వుంచడం ద్వారా మాత్రమే ఆందోళనను పూర్తిగా తుదముట్టించగలం.
కోపము
మనలో గొప్ప గొప్ప వారికే కోపము వొస్తుంది. కోపముకు నీవు ఇచ్చే సమాధానము దేవునిపైన నీ నమ్మిక మరియు వాక్య ద్యానముపపై ఆదారపడి ఉంది. కోపము అంశాముతో పాటు నమ్మిక అను పాఠ్యబాగము కూడా చదవండి. ఈ క్రింది వాక్యాలు మీరు కంటత చేస్తే మీరు కోపముకు సరైన రీతిలో స్పందించడానికి తోడ్పడుతుంది. వాక్యాన్ని కంటత చేయుట ద్వారా మీ జీవితాన్ని మార్చుకోండి. వాక్యాన్ని కంటత చేయుటకు సమగ్రమైన వ్యవస్థ కొరకు www.MemLok.com ను దర్శించండి.
తోటివారి ఒత్తిడి
తోటివారి ఒత్తిడి ఒక గొప్ప విషయంగా భావించవచ్చు, కానీ అది కూడా ఒక భయంకరమైన వాస్తవము కావచ్చు. దేవుడు తనకు అంకితమైన జీవితాన్ని జీవించమని మనలను పిలిచాడు - కాబట్టి ఆయనయొక్క ప్రమాణాలను తెలుసుకోవడం మరియు అవగాహనతో కలిగివుండటం చాలా ముఖ్యము. ఈ ఏడు రోజుల ప్రణాళికలో, మీరు ఒత్తిడిని ఎదుర్కోవటానికి శక్తిని మరియు జీవితాంతం వివేకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
వేధింపు
ఏ వ్యక్తి కూడా వేధించబడుటకు అర్హుడు కాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు పోషించబడాలనియు మరియు సంరక్షింపబడాలనియు ఆయన కోరుకుంటున్నాడు. ఏ తప్పైనను, ఏ లోపమైనను, ఏ అపార్థమైనను, శారీరక, లైంగిక లేదా భావోద్వేగమైన వేధింపులకు లోను కానేరదు. దేవుడు ప్రతి యొక్క వ్యక్తి కొరకు న్యాయము, ప్రేమ మరియు సౌకర్యము కోరుతున్నాడని అర్థము చేసుకోవడానికి ఈ ఏడు రోజుల ప్రణాళిక సహాయం చేస్తుంది.
మరణం
మరణం ప్రతి ఒక్కరు జీవితాంతం ఎదుర్కోవలసిన విషయం. అందుకే చాలా ప్రశ్నలు తలెత్తి మనలను పూర్తిగా కదిలించి వేస్తాయి. ఈ ఏడు రోజుల ప్రణాళిక, మనం మరణాన్ని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని మరియు సౌకర్యమును కనుగొనడం గురించి బైబిలు ఏమి చెపుతోంది అన్నది క్లుప్తంగా వివరిస్తుంది.
కోపము మరియు ద్వేషము
కోపము అనేది ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఎదుర్కొనవలసిన సమస్య. ఈ ఏడు రోజుల ప్రణాళిక, ప్రతి రోజు మీరు చదవడానికి ఒక భాగము ద్వారా మీకు వాక్యానుసారమైన దృష్టిని కలుగజేస్తుంది. పాఠ్యభాగాన్నిచదవండి, సమయము తీసుకొని నిజాయితీగా మిమ్మును మీరు గమనించుకోండి, మరియు మీ పరిస్థితిలో దేవుడిని మీతో మాట్లాడనివ్వండి.
శోధన
శోధన అనేక రూపాల్లో వస్తుంది. మన నిర్ణయాలను మన్నించుకోవడం మరియు మనల్ని మనం సమర్థించుకోవడం చాలా సులభం. ఈ ఏడు రోజుల ప్రణాళిక దేవుని ఆత్మ ద్వారా మీరు శోధనను అధిగమించగలరని చూపిస్తుంది. మీ మనసును ప్రశాంతంగా వుంచడానికి కాస్త సమయం తీసుకొని, దేవుడిని మీ జీవితంలో మాట్లాడనివ్వండి. అప్పుడు మీరు అతిగొప్ప శోధనలను అధిగమించడానికి శక్తి పొందుతారు.
దుస్తులు
సమాజము ఒక వ్యక్తి ఎలాంటి దుస్తులు ధరిస్తాడు అనే దాని మీద చాలా ప్రాముఖ్యత చూపిస్తుంది. కాబట్టి మీరు బైబిల్ మన వస్త్రధారణ గురించి ఏమి చెప్తుంది అని ఆశ్చర్యపడుతున్నారేమో. అది అసలు పట్టించుకునే విషయమా? ఈ ఏడు రోజుల ప్రణాళిక వస్త్రధారణ పట్టించుకునే విషయమే, ఎందుకంటే మీరు దేవుని కుమారుడు లేదా కుమార్తె కాబట్టి, అని తెలుసుకునేందుకు సహాయం చేస్తుంది.
గుసగుసలు
మనము ఉపయోగించే మాటలు కట్టటానికి మరియు కూల్చివేయడానికి అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. ప్రత్యేకముగా గుసగుసలు విషపూరితమైనది. కాబట్టి మీ జీవితంలో పదాలు ఏమి పాత్ర పోషిస్తున్నాయి - జీవింపచేసేవా లేదా ఇతరులను నాశనం చేసేవా? మన నోటి నుండి ఏమి వెలువడుతుంది అనేది దేవుడు చాలా తీవ్రముగా పరిగణిస్తాడనే విషయము అర్ధము చేసుకొనటానికి ఈ ఏడు రోజుల ప్రణాళిక మనకు సహాయపడుతుంది. మిమ్ముల్ని మీరు నిమ్మళపరచుకొని ఆయన చెప్పే మాటలు మాత్రము వినండి. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి